ETV Bharat / city

CM KCR: 'ఉలుకు పలుకు లేకుంటే.. కేంద్రాన్ని వెంటాడి వేటాడుతాం' - kcr latest news

టీఆర్​ఎస్​ వేటాడడం ప్రారంభించిందని.. వరి కొనుగోళ్లు, సాగుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించే వరకు ఉద్యమం ఆపమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. 18 తేదీన ధర్నా తర్వాత కూడా ఉలుకు పలుకు లేకుంటే కేంద్రాన్ని వెంటాడి వేటాడుతామని స్పష్టం చేశారు. అన్ని వేదికలపైనా నిలదీస్తామన్నారు.

CM KCR
CM KCR
author img

By

Published : Nov 16, 2021, 9:53 PM IST

Updated : Nov 16, 2021, 10:08 PM IST

CM KCR: ఉలుగు పలుకు లేకుంటే.. కేంద్రాన్ని వెంటాడి వేటాడుతాం

భాజపా నేతలను వెంటాడుతామని (telangana cm kcr fires bjp) ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. వరి వేయాలన్న బండి సంజయ్​ వ్యాఖ్యలపై కేసీఆర్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద భాజపా నేతలు డ్రామాలాడుతున్నారని విమర్శించిన కేసీఆర్​.. అసలే కోపం, ఆవేదనతో ఉన్న రైతులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వడ్లు కొంటారా.. కొనరా అని ప్రశ్నిస్తున్న రైతులపై (telangana cm kcr fires on bandi sanjay)దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అయినా కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం బండి సంజయ్​కు ఏమొచ్చిందని నిలదీశారు. మొత్తం ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్పామని.. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే వడ్లు కొనడం ప్రారంభించామని స్పష్టం చేశారు.

'నేరుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడిని అడుగుతున్నా.. యాసంగిలో వరి వేయమని చెప్పినవ లేదా.. ఒకవేళ తప్పు చెబితే తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి. పొరపాటు చెప్పినానని చెంపలేసుకోవాలే.. నిజాయతీ ఉంటే వరి వేయకండి అని రైతులకు చెప్పాలే.. పొరపాటుగా చెప్పినానని ముక్కు నేలకు రాయాలి.'

- కేసీఆర్​. రాష్ట్ర ముఖ్యమంత్రి

వరి సాగుపై స్పష్టత ఇవ్వాలంటూ ప్రధాని, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాస్తామని (telangana cm kcr fires on central government) కేసీఆర్​ చెప్పారు. 18వ తేదీని ధర్నా చేశాక.. గవర్నర్​ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపుతామన్న కేసీఆర్​... ఆ తర్వాత ఉలుకు పలుకు లేకుంటే కేంద్రాన్ని వెంటాడి వేటాడుతామని స్పష్టం చేశారు. అన్ని వేదికలపైనా నిలదీస్తామన్నారు. కేంద్రం నుంచి స్పష్టత రాకుంటే రైతులు నష్టపోకుండా రాష్ట్రప్రభుత్వం తరఫున స్పష్టమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పారు.

'తెరాస​ వేటాడడం ప్రారంభించింది. మేం ఉద్యమకారులం. భయకరమైన ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించాం. రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఎంతకైన తెగిస్తాం. ఏది ఏమైనా రైతులను కాపాడుకుంటాం.'

- కేసీఆర్​. రాష్ట్ర ముఖ్యమంత్రి

ఇదీచూడండి: TRS Maha Dharna : ఈనెల 18న ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్​ వద్ద తెరాస మహాధర్నా

Last Updated : Nov 16, 2021, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.