ETV Bharat / city

రాష్ట్రంలో ఈనెల 30 వరకు లాక్​డౌన్​

రాష్ట్రంలో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈసారి మరింత కఠినంగా వ్యవహరిస్తామన్న సీఎం.. ఏప్రిల్‌ 30 తర్వాత దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తేస్తామని స్పష్టం చేశారు. ఈ15 రోజులూ ఎక్కడివారు అక్కడే ఉండాలన్న ముఖ్యమంత్రి.. కొవిడ్‌ 19 వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

telangana cm kcr extended lock down till April 30
రాష్ట్రంలో ఈనెల 30 వరకు లాక్​డౌన్​
author img

By

Published : Apr 12, 2020, 5:00 AM IST

రాష్ట్రంలో ఈనెల 30 వరకు లాక్​డౌన్​

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు, సంక్షోభ సమయంలో అవలంభించాల్సిన విధానంపై సుదీర్ఘంగా చర్చించింది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడింగిచాలని కేబినేట్​ నిర్ణయించింది. కొవిడ్‌ 19 వ్యాప్తి చెందకుండా ఉండాలంటే లాక్‌డౌన్‌ మినహా మరోమార్గం లేదని సీఎం అన్నారు. పక్షం రోజుల పాటు ప్రజలంతా స్వీయ నిర్భంధంలో ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాక నెలాఖరు తర్వాత దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

వైద్యులపై దాడులా..

కరోనా ఎవరికి సోకినా గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకోవాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులపై కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్యగా కేసీఆర్​ అభివర్ణించారు.

పరీక్షల్లేవ్​..

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరనీ పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేయాలని కేబినెట్​ తీర్మానించింది. పదో తరగతి పరీక్షల విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్​ పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవరసం లేదని భరోసానిచ్చారు.

ఎఫ్​ఆర్​బీఎం పరిమితిపై..

లాక్‌డౌన్‌ అమలు వల్ల రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని కేసీఆర్‌ అన్నారు. ఎఫ్​ఆర్​బీఎం పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆదాయం పూర్తిగా దిగజారిందని.. దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కోరారు.

వారిపై పీడీ చట్టం ప్రయోగిస్తాం..

లాక్‌డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరిచే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆహార పదార్థాలు కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు.

పేదలకు ఇచ్చే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ నెలాఖరు వరకు కొనసాగుతుందని కేసీఆర్​ తెలిపారు. రూ.1,500 నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. నిత్యావసర సరకులకు సంబంధించి కొరత ఉన్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.

ఇవీచూడండి: భారత్​లో కరోనా విజృంభణ-మహారాష్ట్రలో తీవ్రత అధికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.