టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఓ పతకం చేరటం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రజత పతకం సాధించిన మీరాబాయి చానును కేసీఆర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగతా క్రీడాకారులు కూడా పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయికి మంత్రి కేటీఆర్ కూడా అభినందనలు తెలిపారు. మీరాబాయి గెలుపు భారత్‌కు గర్వకారణమని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ప్రశంశించారు.
భారత్‌కు తొలి పతకం..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని మీరాబాయి చాను సాధించిపెట్టింది. మహిళల 49 కేజీల విభాగంలో.. వెయిట్ లిఫ్టల్ మీరాబాయి చాను రజతం గెల్చుకుంది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత తొలి వెయిట్ లిఫ్టర్‌గా ఘనత సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది.