గణేశ్ చతుర్థి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండి రైతుల బతుకు బంగారం కావాలని ఆ విఘ్నేశ్వరుణ్ని కోరుకున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.
- ఇదీ చూడండి :విఘ్నేశ్వరుడికి కేంద్ర మంత్రుల పూజలు