ETV Bharat / city

రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - తెలంగాణ తాజా వార్తలు

TELANGANA CABINET meeting
రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
author img

By

Published : Mar 16, 2021, 4:43 PM IST

Updated : Mar 16, 2021, 5:31 PM IST

16:41 March 16

రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో రేపు సాయంత్రం ఏడు గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను ఈ నెల 18న ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్​కు రేపు సాయంత్రం మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. 

కేబినెట్ చివరి సారిగా నవంబర్ 13న సమావేశమైంది. ఆ తర్వాత మంత్రివర్గం మళ్లీ ఇప్పుడు సమావేశం అవుతోంది. బడ్జెట్​కు ఆమోదంతో పాటు ఇతర అంశాలపై కూడా కేబినెట్​లో చర్చిస్తారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. ఇతర పాలనాపర, రాజకీయ అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

ఇవీచూడండి: డీఎఫ్​ఐ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఓకే

Last Updated : Mar 16, 2021, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.