ETV Bharat / city

7 గంటలుగా కొనసాగుతోన్న మంత్రివర్గ భేటీ.. కీలక అంశాలపై చర్చ - తెలంగాణ మంత్రివర్గ సమావేశం

కొత్త సచివాలయ అంశమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుమారు ఏడు గంటలుగా కొనసాగుతోంది. కరోనా కట్టడి చర్యలు, కొవిడ్ నేపథ్యంలో విద్యారంగానికి సంబంధించిన అంశాలపై కేబినెట్​లో చర్చిస్తున్నారు. కరోనా కట్టడి, కృష్ణా జలాల అంశం, నియంత్రిత సాగు సంబంధిత అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమాలోచనలు చేస్తున్నారు.

kcr
kcrఐదు గంటలుగా కొనసాగుతోన్న మంత్రివర్గ భేటీ.. కీలక అంశాలపై చర్చ
author img

By

Published : Aug 5, 2020, 1:44 PM IST

Updated : Aug 5, 2020, 9:45 PM IST

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. ప్రగతి భవన్ వేదికగా ఏడు గంటలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కొత్త సచివాలయ అంశం, నియంత్రిత సాగు, కొవిడ్​ నేపథ్యంలో విద్యారంగానికి సంబంధించిన చర్యలు, కృష్ణా జలాల అంశం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ, రిటైల్ ట్రేడ్, లాజిస్టిక్ పాలసీపై సీఎం చర్చిస్తున్నారు.

సచివాలయ నమూనాకు ఆమోదం తెలిపే అవకాశం

ఆర్​అండ్​బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్​లతో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్... భవన నమూనాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. మంగళవారం కూడా నమూనాను సీఎం పరిశీలించారు. ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో సచివాలయ భవన నమూనాను పరిశీలించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నిర్మాణ పనులకు సంబంధించి కూడా కేబినెట్​లో నిర్ణయం తీసుకోనున్నారు.

కరోనా, నూతన విద్యావిధానంపై చర్చ

నియంత్రిత సాగుపైనా కేబినెట్​లో చర్చిస్తున్నారు. ఈ సీజన్ నుంచే రాష్ట్రంలో నియంత్రిత సాగు అమలవుతుండగా... సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయశాఖ సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో పంటల సాగు సహా కొనుగోళ్లు, మార్కెటింగ్ సహా సంబంధిత అంశాలపై సీఎం సమాలోచనలు చేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రివర్గం చర్చిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలు, అందించాల్సిన చికిత్స సహా సంబంధిత అంశాలపై చర్చ సాగుతోంది. కొవిడ్ కారణంగా విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. విద్యాసంవత్సరం ప్రారంభం, ప్రత్యామ్నాయ బోధనా పద్ధతులు, నూతన విద్యావిధానం, ప్రవేశాలు, ప్రవేశపరీక్షలపై ఈ భేటీలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పలు ఆర్డినెన్స్​లకు ఆమోదం!

నీటిపారుదల శాఖ పేరును జలవనరుల శాఖగా మార్చడంతో పాటు పెరుగుతున్న పరిధికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తైంది. ఈ నేపథ్యంలో కేబినెట్ అందుకు ఆమోదముద్ర వేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​లు, నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాల్లో కోత, ఆయుష్ వైద్యుల పదవీవిరమణ వయోపరిమితి పెంపు ఆర్డినెన్స్​లకు ఆమోదముద్ర వేయనున్నారు.

కృష్ణా జలాల అంశంపై చర్చ

టీఎస్ ఐపాస్​కు అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, రిటైల్ వర్తకం, లాజిస్టిక్ పాలసీలను సర్కార్ సిద్ధం చేసింది. ఈ భేటీలో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కృష్ణా జలాల అంశంపైనా సీఎం చర్చిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల విషయమై ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ప్రభుత్వం... భవిష్యత్​లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ సాగుతోంది. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ, రిటైల్ ట్రేడ్, లాజిస్టిక్ పాలసీలపైనా చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!

Last Updated : Aug 5, 2020, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.