ETV Bharat / city

చట్ట సవరణ ముసాయిదా బిల్లులకు మంత్రివర్గం ఆమోదం

author img

By

Published : Oct 11, 2020, 5:11 AM IST

మార్కెట్ ధర నిర్ధరణకు సంబంధించి ఇక నుంచి సబ్ రిజిస్టార్లకు విచక్షణాధికారాలు ఉండబోవు. ఈ మేరకు చట్టసవరణ ముసాయిదాకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వ్యవసాయేతర భూమికి బదలాయింపు కూడా ధరణి ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జీహెచ్​ఎంసీ చట్టానికి కూడా సవరణలు చేసింది. అలాగే వ్యవసాయేతర ఆస్తుల నమోదు గడువును ఈ 20వరకు పొగిడిస్తూ.. క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది.

Telangana Cabinet accept the few amendment Acts
చట్ట సవరణ ముసాయిదా బిల్లులకు మంత్రివర్గం ఆమోదం

రాష్ట్రంలో కొనసాగుతున్న ఆస్తుల నమోదుకు మంత్రిమండలి గడువు పెంచింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తి కానందున అక్టోబరు 20 తేదీ వరకు గడువును పొడిగించింది. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం పాలక మండలిలో 50 శాతం మహిళా రిజర్వేషన్లకు చట్టబద్ధత లభిస్తుంది. డివిజన్ల రిజర్వేషన్లు మరో అయిదేళ్ల పాటు కొనసాగుతాయి. గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేపట్టాలని ఆదేశించింది. చివరి గింజ వరకు ఎన్నిరోజులైనా కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ‘ధాన్యంలో తేమను 17 శాతానికి మించకుండా చూసుకోండి. తాలు, పొల్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లండి’ అని రైతాంగాన్ని కోరింది.

కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా..

మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రాకుండా పోవడానికి కేంద్రం నిర్ణయాలు కారణమని మంత్రిమండలి ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘దేశంలో వ్యవసాయ రంగానికి కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారడం శోచనీయం. విశ్వ విపణిలో మొక్కజొన్న నిల్వలు ప్రజావసరాలకు మించి ఉన్నాయి. కేంద్ర నిర్ణయాల నేపథ్యంలో మొక్కజొన్న సాగు విషయంలో రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి’ అని కోరింది. రిజిస్ట్రేషన్‌, నాలా చట్ట సవరణలకు మంత్రిమండలి అంగీకరించింది. హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో సమీకృత టౌన్‌షిప్‌ల ప్రోత్సాహక విధానానికి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో నాలుగు గంటల పాటు మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

జీహెచ్‌ఎంసీ చట్ట సవరణలో...

కొత్త పురపాలక చట్టానికి సంబంధించిన పలు నిబంధనలను జీహెచ్‌ఎంసీ-55 చట్టంలో చేర్చేందుకు వీలుగా చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో అమల్లో ఉన్న 50 శాతం మహిళా రిజర్వేషన్లను శాశ్వతంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. వార్డు కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించేలా కొత్త విధానం రూపుదాల్చనుంది. డివిజన్లలో రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయి.

వ్యవసాయ రంగంపై...

కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేసినట్టు... ఈసారి కూడా అదే పద్ధతిలో ధాన్యం సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

నాలా చట్టానికి సవరణ

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయకుండా చూసేందుకు (వితవుట్‌ హ్యూమన్‌ ఇంటర్‌ఫియరెన్స్‌) ఇటీవల తెచ్చిన నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. దీనివల్ల ధరణి పోర్టల్‌ ద్వారా సంబంధిత వివరాలను సమర్పించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు పౌరులకు లభిస్తుంది. భూమార్పిడిని సులభతరం చేసే ఈ చట్ట సవరణకు అనుమతించింది.

మరిన్ని ఇలా...

  • కొత్త రెవెన్యూ చట్టంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ చట్టానికి స్వల్ప సవరణలు.
  • నిరుపేదలకు, జనాభా అవసరాలకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ పరిధిలో ఇళ్లను నిర్మించేందుకు వీలుగా సమీకృత టౌన్‌షిప్‌ విధానాన్ని ఆమోదించింది. టౌన్‌ఫిప్‌ల నిర్మాణానికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.

కేంద్రం యోచనపై విస్మయం

రాబోయే సీజన్‌లో రాష్ట్రంలో సాగుచేయబోయే మొక్కజొన్న అంశంపై మంత్రిమండలి చర్చించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో వ్యవసాయ రంగానికి, ప్రత్యేకించి మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించని దుస్థితి ఏర్పడిందని పేర్కొంది. దేశంలో అవసరానికి మించి మొక్కజొన్న నిల్వలున్నప్పటికీ దేశ రైతాంగ ప్రయోజనాలను విస్మరించి, ఇతర దేశాల నుంచి మక్కలు దిగుమతి చేసుకోవాలనుకునే కేంద్రం ఆలోచనపై విస్మయం వ్యక్తం చేసింది. సంప్రదాయంగా మొక్కజొన్నపంటను సాగుచేసే తెలంగాణ రైతుకు కనీస మద్దతు ధర రాకుండాపోయే గడ్డుకాలం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేయకపోవడమే శ్రేయస్కరమని అభిప్రాయపడింది.

ఇవీ చూడండి: 'రాష్ట్రంలో మొక్కజొన్న సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.