కోటి ఆశలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ తన అబద్ధాల రికార్డును తానే బద్ధలుకొట్టారని ఎద్దేవా చేశారు. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ విద్యార్థులను మోసం చేశారు. నియామకాల విషయంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగింది. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని మోసం చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం అయ్యాయి.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: అవతరణ వేడుకల్లో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి