ETV Bharat / city

కేసీఆర్ నిజాం పాలనను మరిపిస్తున్నారు: తరుణ్​ చుగ్ - telangana political updates

భాజపా ప్రభుత్వం.. ప్రజల ఒక్కో సమస్యను క్రమంగా పరిష్కరిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి తరుణ్​చుగ్​ తెలిపారు. కరోనా వేళ ప్రజలు అవస్థలు పడినా.. ఫాంహౌస్​ నుంచి కేసీఆర్​ బయటకురాలేదన్నారాయన.

tarun chugh
కేసీఆర్ నిజాం పాలనను మరిపిస్తున్నారు: తరుణ్​ చుగ్
author img

By

Published : Dec 18, 2020, 4:01 PM IST

Updated : Dec 18, 2020, 5:06 PM IST

తెలంగాణ మారుతుందని.. ఎక్కడికెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి తరుణ్​చుగ్​ అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని.. సంపద దోచుకునే పనిలో ఉందని ఆరోపించారు.

కరోనా సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని తరుణ్​చుగ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అవస్థలు పడినా.. రాష్ట్ర రాజాబాబు సెవన్​స్టార్ ఫాంహౌస్​ నుంచి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు.. ఒక్క ఆస్పత్రి.. ఒక్క రిక్షావాలా కుటుంబాన్నీ ముఖ్యమంత్రి పరామర్శించలేదు. ప్రజలను కష్టాలు పెట్టే వాడు కాదు.. కష్టాలు తీర్చే వాడు కావాలి. నిజాం సాహి సర్కార్ ఇక్కడ నడుస్తోంది. భాజపా సీఎం.. సచివాలయానికి ఎందురు రారు. మోడీ ప్రభుత్వం ఏమి చేసిందో.. తెరాస సర్కారు ఏం చేసిందో చర్చకు సిద్ధం. భాజపాని ఆపడం కోసమే గ్రేటర్ ఎన్నికలు తొందరగా పెట్టారు. వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత సామాన్యుడు ముఖ్యమంత్రి అవుతారు. రాజబాబు మేలుకో... ఇచ్చిన హామీలు నెరవేర్చు.

-తరుణ్​ చుగ్​, భాజపా రాష్ట్రవ్యవహారాల ఇన్​ఛార్జి

జీహెచ్​ఎంసీ మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదని తరుణ్​చుగ్​ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మజ్లిస్, తెరాస దాగుడు మూతలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణని ఎవరికి కుదువ పెట్టనియమని.. తాము తెరాసతో డూప్​ ఫైటింగ్ చేయడం లేదని.. రెజ్లింగ్​కి రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ట్రైలర్ చూపించాం... ఫిల్మ్ ఇంకా మిగిలే ఉందని వెల్లడించారు.

కేసీఆర్ నిజాం పాలనను మరిపిస్తున్నారు: తరుణ్​ చుగ్

ఇవీచూడండి: భాగ్యనగర నేతలతో భాజపా ఇంఛార్జీ తరుణ్‌చుగ్ భేటీ

Last Updated : Dec 18, 2020, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.