మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పంచాయతీరాజ్ సవరణ బిల్లును సభలో ఇవాళ ప్రవేశపెట్టారు. ఆ బిల్లును శాసనసభ ఆమోదించింది. బిల్లులో భాగంగా 147/11, 176/9 ఈ రెండు సెక్షన్లలో చేసిన సవరణలను శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుకు భాజపా మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూనే నిరసన వ్యక్తం చేసింది. సభలో తమకు కీలకమైన అంశాల మీద మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని శాసనసభ నుంచి కాంగ్రెస్ నేతలు వాకౌట్ చేశారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది.
- ఇదీ చూడండి : సభలో మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ వాకౌట్