ETV Bharat / city

Minister Niranjan Reddy latest : 'కేసీఆర్ పోరాట సంకేతం.. సాగుచట్టాల రద్దుకు ఓ కారణం'

నూతన సాగు చట్టాల రద్దు(farm laws withdrawn 2021)ను స్వాగతించిన తెరాస.. ఇది అన్నదాతల విజయంగా అభివర్ణించింది. దక్షిణాదిలోనూ రైతు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడే ప్రమాదం ఉందని గ్రహించే కేంద్రం వెనక్కి తగ్గిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(minister niranjan reddy) అన్నారు. రైతు పోరాటంలో కాంగ్రెస్ పాత్ర శూన్యమని తెలిపారు.

Minister Niranjan Reddy latest
Minister Niranjan Reddy latest
author img

By

Published : Nov 19, 2021, 12:29 PM IST

సాగు చట్టాల రద్దుపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందన

నూతన సాగు చట్టాల(farm laws withdrawn 2021)ను కేంద్రం వెనక్కి తీసుకోవడం సంతోషకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(telangana agriculture minister) అన్నారు. వణికించే చలిలో కూడా ఉద్యమం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. అసువులు బాసిన రైతులకు కన్నీటి నివాళులు అర్పించారు. రైతుల పోరాటాలకు ముందే కేంద్రం నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

మోదీ క్షమాపణ హుందాగా ఉంది..

సాగు చట్టాల(farm laws withdrawn 2021)పై ఆలస్యంగా స్పందించి కేంద్రం పరువు పోగొట్టుకుందని నిరంజన్ రెడ్డి(minister niranjan reddy) పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉద్యమం బలపడే అవకాశం ఉందని భాజపా అంచనా వేసిందన్న మంత్రి.. దక్షిణాది రాష్ట్రాల్లో రైతు ఉద్యమానికి కేసీఆర్(Telangana CM KCR) నేతృత్వం వహిస్తారని భావించారని చెప్పారు. రైతులకు ప్రధాని మోదీ(prime minister modi) క్షమాపణలు చెప్పడం హుందాగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని భాజపా నేతలకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదని మండిపడ్డారు.

రైతు పోరాటంలో కాంగ్రెస్ పాత్ర శూన్యం..

"మూడు నల్ల చట్టాల(farm laws withdrawn 2021)కు కాంగ్రెస్సే పురుడు పోసింది. కాంగ్రెస్ పురుడుపోస్తే.. భాజపా పెంచి పోషించింది. రైతు పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర శూన్యం. నల్లచట్టాలకు ఆధ్యులు వాళ్లే. రెండు జాతీయ పార్టీలు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. నల్ల చట్టాలతో మేలు జరుగుతుందని కొంతమంది మేధావులు మాట్లాడారు. స్వయం ప్రకటిత మేధావులంతా రైతులకు క్షమాపణలు చెప్పాలి. వణికించే చలిలో కూడా ఉద్యమం చేసిన రైతులకు తెరాస అభినందనలు. పోరాటంలో అసువులు బాసిన అన్నదాతల కుటుంబాలకు కేంద్రం పరిహారం చెల్లించి ఆదుకోవాలి."

- నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

కేసీఆర్ పోరాట సంకేతం కూడా ఓ కారణమే..

పరిపాలనా దక్షుడు.. ఉద్యమ నేత కేసీఆర్(telangana cm kcr) ఇచ్చిన పోరాట సంకేతాలు కూడా కేంద్రం వెనక్కి తగ్గడానికి కారణమని మంత్రి నిరంజన్‌రెడ్డి(Telangana agriculture minister) వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలతో రాష్ట్రం సాధించిన ఘనతతో పాటు పార్లమెంట్‌లో ఉద్యమానికి మద్దతు కూడగట్టిన తీరు మోదీ(prime minister modi)కి తెలుసన్నారు. పరిపాలనలోనూ కేసీఆర్ తనదైన ముద్రవేస్తున్నారని.. ప్రజాదరణ కలిగిన నేత రైతు ఉద్యమాని(Indian farmers protest)కి శ్రీకారం చుడితే ప్రమాదమని కేంద్రం గ్రహించిందని మంత్రి(minister niranjan reddy) తెలిపారు.

సాగు చట్టాలు రద్దు(farm laws withdrawn 2021) చేసిన కేంద్రం వరి ధాన్యం(paddy procurement 2021) కొనుగోలుపైనా ఓ నిర్ణయం తీసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి(Telangana agriculture minister) డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. విద్యుత్ చట్టాల(electricity laws 2020)ను కూడా ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశమంతా రైతులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ ధర్నాతో కేంద్రం దిగొచ్చింది..

సాగుచట్టాల(farm laws withdrawn 2021)ను వెనక్కి తీసుకోవటంపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి(errabelli dayakar rao news 2021) హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌(telangana cm kcr)కే ఈ ఘనత దక్కుతుందని అన్నారు. రైతుల పోరాటాలు, కేసీఆర్‌ ధర్నాతో కేంద్రం దిగొచ్చిందని తెలిపారు. ఆరంభం నుంచి కేసీఆర్‌ సాగు చట్టాలను వ్యతిరేకించారని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లు(paddy procurement 2021) కూడా చేపడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.