ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Jun 22, 2022, 4:58 PM IST

  • రద్దు దిశగా మహా అసెంబ్లీ?

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయడం ఖాయమేనని తెలుస్తోంది. 'అసెంబ్లీ రద్దు' గురించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన ట్వీట్‌ ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది.

  • 'విచారణకు హాజరుకాలేను.. వాయిదా వేయండి'

కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావడాన్ని వాయిదా వేయాలని సోనియా గాంధీ.. ఈడీ అధికారులను కోరారు. ఈ మేరకు లేఖ రాసినట్లు ఆ పార్టీ నేత జైరాం రమేశ్ వెల్లడించారు.

  • 'మోదీజీ.. నల్లచట్టాల్లాగే 'అగ్నిపథ్'​ పథకాన్ని వెనక్కి తీసుకుంటారు'

భారత్​పైకి చైనా విరుచుకపడడానికి చూస్తున్న సమయంలో.. సైన్యాన్ని కేంద్రం మరింత బలపరచాల్సింది పోయి బలహీనపరుస్తోందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. వ్యవసాయ చట్టాల్లాగే 'అగ్నిపథ్​' పథకాన్ని ఉపసంహరించుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు.

  • 'త్వరలో రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ'

వానాకాలం పంట పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. త్వరలోనే రైతుబంధు నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటంచారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

  • సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సూటి ప్రశ్నలు.. ఏంటంటే?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తనదైన శైలిలో ట్విటర్‌లో కేసీఆర్‌నుద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.

  • ముత్యాల సవ్వడులు... బొగత అందాల పరవళ్లు చూశారా..!

రుతుపవనాల ప్రభావంతో.. వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దీనితో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం సమీపంలోని.. అటవీ ప్రాంతంలోని ముత్యల జలపాతం.. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాలనురగల్లాంటి జలధారలు కొండపై నుంచి కిందకు పరుగులు పెడుతూ మనోహరంగా నిలుస్తున్నాయి.

  • షటిల్ ఆడుతూ.. కోర్టులోనే కుప్పకూలిన యువకుడు !

మరణం ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్న వారిని కూడా మృత్యుఒడికి చేరుస్తున్నాయి. అప్పటి వరకు ఆడుతూ, పాడుతూ సరదగా గడిపిన వారు కొన్నిసార్లు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు.

  • సెన్సెక్స్​ 700 పాయింట్లు డౌన్

స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 709 పాయింట్లు కోల్పోయి 51,822 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్లు పతనమై 15,413కి పడిపోయింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులున్నప్పటికీ ఆసియా మార్కెట్ల ప్రతికూలతలు సూచీలను ప్రభావితం చేశాయి.

  • డీకే.. ఏకంగా 108 స్థానాలు జంప్​ ..

ఐపీఎల్​ నుంచి అద్భుత ఫామ్ కొనసాగిస్తూ, అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న దినేశ్​ కార్తీక్​.. టీ20 ర్యాంకింగ్స్​లో అమాంతం దూసుకొచ్చాడు. ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంకుకు చేరుకున్నాడు.

  • 'కార్మికులకు వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధం'

సినీ కార్మికుల సమ్మె, వేతనాలు పెంపుపై నిర్మాతల మండలి స్పందించింది. కార్మికులకు వేతనాలు పెంచడానికి తమకెలాంటి ఇబ్బంది లేదని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.