ETV Bharat / city

తెజస బలోపేతంపై నిర్మాణ సబ్​-కమిటీ సమావేశం - తెజస సమావేశం

పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు తెజస... కార్యచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు నియమించిన నిర్మాణ సబ్​ కమిటీ సమావేసమైంది. భవిష్యత్​లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

telanagana jana samithi sub-committee meeting nampally party office
తెజస బలోపేతంపై నిర్మాణ సబ్​-కమిటీ సమావేశం
author img

By

Published : Aug 30, 2020, 8:17 PM IST

తెలంగాణ జన సమితిని గ్రామస్థాయి నుంచి పటిష్ఠంగా నిర్మించే లక్ష్యంతో... అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేసిన నిర్మాణ సబ్-కమిటీ సమావేశం నాంపల్లి పార్టీ కార్యాలయంలో జరిగింది. దుబ్బాక శాసనసభ ఉపఎన్నిక సహా... వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్​లకు ఇంఛార్జీల నియామకంపై సమాలోచనలు చేశారు.

ఆదివాసీ, నిరుద్యోగ సమస్యలపై తక్షణమే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. కోవిడ్​పై అఖిలపక్షాలు, ప్రజాసంఘాలతో సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. యుద్ధప్రాతిపదికన పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియకు చర్యలు తీసుకోనున్నారు. ధర్మార్జున్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... గోపగాని శంకర్ రావు, శ్రీశైలం రెడ్డి, ప్రకాష్ గౌడ్, మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కేసీఆర్​ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.