ETV Bharat / city

అన్​లాక్​-4 ఉత్తర్వులు.. ఈ నెల 7 నుంచి మెట్రో సేవలు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​... అన్​లాక్​-4 ఉత్తర్వులు జారీ చేశారు. కంటైన్మెంట్ జోన్లలో ఈ నెలఖారు వరకు లాక్​డౌన్​ అమలవుతుందన్న ప్రభుత్వం... సెప్టెంబరు 7 నుంచి మెట్రో రైళ్లు నడిపేందుకు అనుమతిచ్చింది.

telanagana chief secretery somesh kumar release unlock-4 rules
అన్​లాక్​-4 ఉత్తర్వులు.. ఈ నెల 7 నుంచి మెట్రో సేవలు
author img

By

Published : Sep 2, 2020, 5:29 AM IST

అన్​లాక్​-4 ఉత్తర్వులు.. ఈ నెల 7 నుంచి మెట్రో సేవలు

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత అన్​లాక్ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల మూసివేత కొనసాగుతుందని... ఈత కొలనులు, ఎంటర్ టైన్మెంట్ పార్కులు, థియేటర్లు కూడా తెరవరాదని స్పష్టం చేసింది. ఆన్​లైన్, డిజిటల్ విధానంలో బోధనకు అనుమతించిన ప్రభుత్వం... ఈ నెల 21 నుంచి కంటైన్మెంట్ జోన్ల వెలుపల 50 శాతం బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాలలకు రావచ్చని తెలిపింది. 9 నుంచి 12 తరగతుల వరకు విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో విద్యాసంస్థలకు వెళ్లవచ్చని పేర్కొంది.

నిబంధనలకు లోబడి..

వంద మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడా, సాంస్కృతిక, వినోద, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు నిబంధనలకు లోబడి జరుపుకోవచ్చన్న ప్రభుత్వం... అప్పటి వరకు పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరుకావాలని స్పష్టం చేసింది. 21 తర్వాత ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరవవచ్చని, సెప్టెంబరు 7 నుంచి నియంత్రిత విధానంలో మెట్రో రైళ్లు నడపవచ్చని పేర్కొంది. బార్లు, క్లబ్బులు తెరిచేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

కంటైన్మెంట్లలో..

65 ఏళ్ల పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో నెలాఖరు వరకు లాక్​డౌన్ పూర్తిస్థాయిలో అమలవుతుందని, అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల కేసులు వచ్చే ఆస్కారం ఉన్న ప్రాంతాలను బఫర్ జోన్లుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీచూడండి.. ' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.