ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పక్కన కూర్చున్న తహసీల్దార్ రామకృష్ణ నిద్రలోకి జారుకున్నారు. పట్టాల పంపిణీలో భాగంగా వేదికపైన ఉన్న అధికారులు, నాయకులు ఏపీ సీఎం జగన్ ప్రసంగాన్ని టీవీలో వీక్షిస్తున్నారు.
ప్రసంగం ఎక్కువ సేపు ఉండడం వల్ల తహసీల్దార్ నిద్రలోకి జారుకున్నారు. అధికారిని చూసిన లబ్ధిదారులు ముక్కున వేలేసుకున్నారు. మీడియా ప్రతినిధులు కెమెరాలో బంధించటం చూసి పురపాలక కమిషనర్ కృష్ణ.. తహసీల్దార్ రామకృష్ణను అప్రమత్తం చేశారు.
- ఇదీ చదవండి : అన్నం ముట్టదు.. మిక్చర్ వదలదు!