ETV Bharat / city

Ts News : సర్కారీ బడుల్లో విద్యార్థులు ఎంతమంది? ఉపాధ్యాయులు ఎంతమంది?

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణకు అవసరమైన మార్గదర్శకాలతో త్వరలోనే ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నిర్ణయించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు రంగం సిద్ధం
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు రంగం సిద్ధం
author img

By

Published : Aug 12, 2021, 7:34 AM IST

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. ప్రక్రియకు అవసరమైన మార్గదర్శకాలతో వారం పదిరోజుల్లో ప్రభుత్వం జీవో జారీచేయనుంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నిర్ణయిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే వారిని ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలకు బదిలీ చేస్తారు.

అదే ప్రామాణికం..

ఈ క్రమంలో డీఈవోలను సమాయత్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం సాయంత్రం వర్చువల్‌ సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. హేతుబద్ధీకరణను ప్రభుత్వం 2015లో పూర్తిచేసింది. ఆ సందర్భంగా ఇచ్చిన జీవో 11, 17ల్లో కొన్ని మార్పులుచేర్పులతో కొత్త జీవో తీసుకురానుంది. గత విద్యా సంవత్సరం(2020-21) జిల్లా పాఠశాల విద్యా సమాచారం(యూడైస్‌)లో నమోదైన విద్యార్థుల సంఖ్యను ఈసారి ప్రామాణికంగా తీసుకుంటారు.

వారు ఎక్కువగా ఉన్నారు..

ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులున్నారు, మంజూరు పోస్టులెన్ని, పనిచేస్తున్నవారెందరు, ఖాళీలెన్ని.. తదితర వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలని శ్రీదేవసేన డీఈవోలను ఆదేశించారు. గతంలో ఇచ్చిన జీవో 11, 17ల మార్గదర్శకాలను చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. అవసరానికి మించి ఉపాధ్యాయులుంటే వారిని ఎక్కడికి పంపాలో కూడా తెలుసుకోవాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీలు) ఎక్కువగా ఉన్నపుడు.. అలాంటి వారికి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు అవసరమైన అర్హతలుంటే ఉన్నత పాఠశాలల్లో తాత్కాలికంగా సర్దుబాటు చేయవచ్చని చెప్పినట్లు తెలిసింది. ఒక్క విద్యార్థీ లేని పాఠశాలకు సైతం ఒక ఉపాధ్యాయ పోస్టు ఉంచాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆంగ్లం బోధించే సబ్జెక్టు టీచర్లు అవసరానికి మించి ఉన్నట్లు చెబుతున్నారు.

విద్యార్థులు- టీచర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.