బాపట్ల జిల్లాలో వైకాపా నేతల దౌర్జన్యానికి ఓ ఉపాధ్యాయురాలి కుటుంబం రోడ్డున పడింది. ఇంటికి వెళ్లే దారిలో వైకాపా నేతలు గోడకట్టారని కొరిశపాడు మండలం బొడ్డువానిపాలేనికి చెందిన సుధారాణి వాపోయారు. న్యాయం చేయాలంటూ ముగ్గురు పిల్లలతో కలిసి.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చక్రాల కుర్చీలో బయలుదేరారు.
అడ్డుకున్న పోలీసులు: ఉపాధ్యాయురాలు సుధారాణి కుటుంబాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇంటికి వెళ్లే దారిలో వైకాపా నేతలు గోడకట్టారని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చక్రాల కుర్చీలో వచ్చిన ఆమెను తాడేపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. తనకు న్యాయం జరిగేవరకు తాడేపల్లిలోనే ఉంటానని సుధారాణి.. రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. తాడేపల్లి సీఎం కార్యాలయం వద్దకు వచ్చిన కొరిశపాడు ఎమ్మార్వో.. సుధారాణి కుటుంబసభ్యులతో మాట్లాడి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.
ఇవీ చదవండి:
Damera Rakesh's funeral: అశ్రునయనాల మధ్య ముగిసిన రాకేష్ అంత్యక్రియలు
ఆగని 'అగ్గి'.. వాహనాలు 'బుగ్గి'.. దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా 'అగ్నిపథ్' నిరసనలు