ETV Bharat / city

ఏపీ సర్కారుకు షాక్​.. మండలిలో నెగ్గిన తెదేపా తీర్మానం - article 71 rule

మూడు రాజధానుల బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలన్న వైకాపా ప్రయత్నాన్ని ప్రతిపక్ష తెదేపా వ్యూహాత్మకంగా తిప్పికొట్టింది. అనూహ్యంగా నిబంధన 71 అస్త్రాన్ని ప్రయోగించింది. రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్లు మోహరించి మరీ బిల్లుపై చర్చకు చేసిన ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంది. అయితే బిల్లుపై జరిగిన ఓటింగ్​లో ఇద్దరు తెదేపా ఎమ్మెల్సీలు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. గందరగోళ పరిస్థితుల మధ్య శాసన మండలి నేటికి వాయిదా పడింది.

సర్కారుకు షాక్​.. మండలిలో నెగ్గిన తెదేపా తీర్మానం

author img

By

Published : Jan 22, 2020, 7:56 AM IST

ఆంధ్రప్రదేశ్​లో మూడు రాజధానుల బిల్లుపై నాటకీయ పరిణామాల మధ్య శాసన మండలిలో తెదేపా ప్రవేశపెట్టిన రూల్‌ 71 తీర్మానం నెగ్గింది. తొలుత తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఛైర్మన్‌ షరీఫ్‌ ఓటింగ్‌ నిర్వహించారు. రూల్‌ 71కు అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11, తటస్థంగా 9 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా పడిన ఓట్లలో తెదేపా ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్​రెడ్డి ఉండడం గమనార్హం. ఉదయం నుంచి అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య నువ్వా నేనా అన్నట్లు పరిస్థితులు కొనసాగాయి. సభ ప్రారంభం కాగానే రూల్‌ 71 కింద శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు.

అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదం

తెదేపా నిబంధన 71 అస్త్రంపై అధికార వైకాపా తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులు ప్రవేశపెట్టేముందు రూల్‌ 71 కింద తీర్మానం పెట్టడం సంప్రదాయాలకు విరుద్ధమని వైకాపా సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బిల్లులపై చర్చ జరపాలంటూ అధికార పక్షం, రూల్‌ 71పై అంటూ ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు సభ వాయిదా పడింది. అనంతరం ప్రతిపక్ష సభ్యుల సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో రూల్‌ 71పై చర్చకు ఛైర్మన్‌ షరీఫ్‌ అనుమతించారు.

పంతం నెగ్గించుకున్న తెదేపా

తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ చర్చను ప్రారంచగా.. ఆ పార్టీకి చెందిన మరికొంతమంది సభ్యులు సైతం దీనిపై మాట్లాడారు. చర్చ అనంతరం ఛైర్మన్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో తెదేపాకు అనుకూలంగా 27, వైకాపాకు అనుకూలంగా 13 ఓట్లు పడ్డాయి. తెదేపా ప్రవేశపెట్టిన రూల్‌ 71 తీర్మానం నెగ్గినట్లయింది. ఓటింగ్‌ అనంతరం సభను నేటికి వాయిదా వేశారు. మరోవైపు రూల్‌ 71 తీర్మానం ఆమోదం పొందడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుల చర్చ జరిగే అవకాశం లేదని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

సభలో గందరగోళ పరిస్థితులు

ఓటింగ్‌కు ముందు శాసన మండలిలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రూల్‌ 71పై చర్చ సందర్భంగా తెదేపా సభ్యులు ప్రభుత్వం తీరును ఎండగట్టారు. అమరావతి ప్రాంతంలో రైతులు మృతి చెందితే ముఖ్యమంత్రి కనీసం పరామర్శించలేదని తెదేపా ఎమ్మెల్సీ సంధ్యారాణి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల కోసం ముఖ్యమంత్రి డమ్మీ కాన్వాయ్‌ తిప్పారని ఎద్దేవా చేశారు. దీనిపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మహిళా సభ్యులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సంధ్యారాణికి తెదేపాకు చెందిన మరో ఎమ్మెల్సీ జగదీశ్‌ అండగా నిలిచారు. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులవైపు మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ దూసుకొచ్చారు. ఈ పరిస్థితిలో సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ దశలో మండలిలో వైకాపా పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కలుగజేసుకుని తమ సభ్యులను శాంతింపజేశారు. ఈ క్రమంలో తెదేపా, వైకాపా విధానాలను భాజపా సభ్యుడు మాధవ్​ తప్పుబట్టారు. మూడు రాజధానుల విధానం సరికాదన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ విధానం మంచిదని.. అందులోని తప్పులను సరిదిద్దాలని ప్రభుత్వానికి మాధవ్‌ సూచించారు.

ఇదీ చూడండి:

తెదేపా బ్రహ్మాస్త్రం: ఇంతకీ రూల్​ 71 ఏంటీ?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.