ETV Bharat / city

'రెండేళ్లలో తెదేపా అధికారంలోకి రావడం పక్కా' - సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావు

ఏపీలో రెండేళ్లలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని.. ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

'రెండేళ్లలో తెదేపా అధికారంలోకి రావడం పక్కా'

author img

By

Published : Jun 27, 2022, 2:28 PM IST

ఆంధ్రప్రదేశ్​లో రెండేళ్లలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని.. సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోజురోజుకూ ప్రజల్లో తెదేపాకు ఆదరణ పెరుగుతోందని, చంద్రబాబు అధికారం చేపట్టడం తథ్యమని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. కార్యకర్తలు ఇదే ఉత్సాహం కొనసాగించాలని సూచించారు. ఎన్టీఆర్‌ దార్శనికుడని, నేటితరం నాయకులు ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు.

ఎన్నో హిట్‌ చిత్రాలను ప్రజలకు అందించిన దర్శకుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆనందబాబు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో 360 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ చెప్పారు.

ఇవీ చూడండి..

పోడు భూముల వివాదం.. అటవీ సిబ్బందితో రైతుల వాగ్వాదం

'ఆ పాత్ర చేయండి ప్లీజ్​.. రూ.2355కోట్లు ఇస్తాం'​.. జానీడెప్​కు డిస్నీ జాక్​పాట్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.