ETV Bharat / city

ఏపీలో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం - తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి వార్తలు

ఏపీలో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇది వైకాపా పనే అని పట్టాభి ఆరోపించారు.

tdp-spokesperson-pattabhis-car-was-destroyed-at-vijayawada
ఏపీలో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం
author img

By

Published : Oct 4, 2020, 9:01 AM IST

ఏపీలో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కారును గత రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. విజయవాడ గురునానక్ కాలనీ సమీపంలోని తన నివాసం వద్ద పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలకొట్టారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నందున వైకాపానే ఈ దుశ్చర్యకు పాల్పడిందని పట్టాభి ఆరోపించారు.

వైకాపా అవినీతిని బయటపెడుతున్నందుకే తన కారుని ధ్వంసం చేశారని మండిపడ్డారు. తన నివాసం పక్కన హైకోర్టు జడ్జి నివాసం ఉందని... అక్కడ పోలీస్ పికెట్ ఉన్నా తన కారుని ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ఎక్కడో సర్వే రాళ్లు తీసుకువచ్చి కారు పగలగొట్టారన్నారు. తన కారు ధ్వంసం చేస్తే భయపడే పిరికిపందను కాదని పట్టాభి తెలిపారు. పోలీసులు పట్టాభి నివాసానికి వచ్చి ధ్వంసమైన కారును పరిశీలించారు.

ఇదీ చూడండి: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై హైకోర్టు కీలక నిర్ణయం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.