ETV Bharat / city

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడండి: చంద్రబాబు - హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు

తెలంగాణలో పురపాలక ఎన్నికలకు తెదేపా సమాయత్తమవుతోంది. స్థానిక నాయకులు అభ్యర్థులుగా పురపోరులో బరిలోకి దిగాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో తెలంగాణ నేతలతో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. మున్సిపల్​ ఎన్నికల్లో నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు.

tdp-prepares-for-municipal-elections
మున్సిపల్‌ ఎన్నికల్లో "తెతెదేపా" గెలుపే లక్ష్యం
author img

By

Published : Dec 29, 2019, 5:29 AM IST

Updated : Dec 29, 2019, 7:45 AM IST

పురపాలక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ తెదేపా నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అర్హత కలిగిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని పార్లమెంటరీ కమిటీల ఆధ్వర్యంలో స్థానికులకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పార్టీ రాష్ట్ర నేతలతో హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ ట్రస్ట్​ భవన్‌లో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు.

క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు అడిగి తెలుసుకున్నారు. తెరాస ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, పురపాలక సంఘాల రిజర్వేషన్ల గందరగోళంపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో సంస్థాగత బలోపేతంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఎన్నికలు పూర్తి స్థాయి సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడండి: చంద్రబాబు

ఇవీ చూడండి: 'చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి'

Intro:Body:Conclusion:
Last Updated : Dec 29, 2019, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.