ETV Bharat / city

TDP: ఏపీ ప్రయోజనాలు దెబ్బతీసేలా జల్​శక్తి శాఖ గెజిట్: తెదేపా - సీఎం జగన్​పై చంద్రబాబు మండిపాటు

ఏపీ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కేంద్ర జల్​శక్తి జారీ చేసిన నోటిఫికేషన్ ఉందని తెలుగుదేశం ధ్వజమెత్తింది. ఏపీ ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి వెళ్లటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో ఉన్న అంశాలకు సంబంధించిన లోటుపాట్లు, వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వైకాపా ప్రభుత్వం సమస్యల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే, ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ప్రయోజనాలు కాపాడేందుకు తెలుగుదేశం ఎంతవరకైనా పోరాడుతుందని తేల్చి చెప్పారు.

TDP
TDP
author img

By

Published : Jul 17, 2021, 7:11 PM IST

తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకువస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్​కు బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో ఉన్న అంశాలకు సంబంధించిన లోటుపాట్లు, వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. గెజిట్​ను పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని తెలిపారు. ఏపీ ప్రాజెక్టులన్నీ కేంద్ర పరిధిలోకి వెళ్లటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం చేసిన చంద్రబాబు, ఏపీ ప్రయోజనాలు కాంక్షించే వారెవ్వరూ దీనిని స్వాగతించరని ప్రభుత్వాన్ని ఉద్దేశించి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంల మూర్ఖత్వం కారణంగానే నదీ జలాలపై కేంద్రం పెత్తనం చేజిక్కించుకుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య బంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు, స్నేహాలు సజీవంగా ఉన్నాయన్నారు. మన సీఎంలు కట్టిన ప్రాజెక్టుల మీదకు మన ఇంజినీర్లు వెళ్లాలంటే సీఐఎస్ఎఫ్ బలగాల అనుమతి కావాల్సిన దుర్గతి ఏర్పడిందని ఆక్షేపించారు. చివరకు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల భవిష్యత్​ను ప్రశ్నార్థకం చేసే ప్రమాదం కనిపిస్తోందన్న సోమిరెడ్డి.. వెలిగొండ ప్రాజెక్టును మాత్రం విస్మరించి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ లాంటి చిన్న ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పెత్తనమేంటని ప్రశ్నించారు. వీటిపై రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసులు లోతుగా చర్చించి ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి అన్యాయం చేసేలా నోటిఫికేషన్...

ఏపీకి తీవ్ర అన్యాయం చేసేలా ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ ఉందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. వివాదాలకు తావులేని ప్రాజెక్టులను సైతం నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకురావటానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసమర్థతే కారణమని దుయ్యబట్టారు. 2015లో రెండు తెలుగురాష్ట్రాల మధ్య జరిగిన ఉమ్మడి ఒప్పందం, 2016లో జారీ అయిన డ్రాప్ఠ్ నోటిఫికేషన్ల ఆధారంగా రీనోటిఫికేషన్ ఇచ్చేలా కేంద్రంపై జగన్ రెడ్డి ఒత్తిడి తీసుకురావాలని రామానాయుడు డిమాండ్ చేశారు.

ఏపీ నీటి హక్కులు హరించే విధంగా, భవిష్యత్తులో రైతులకు సాగునీటి ఇబ్బందులు కలిగేలా కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఉందన్నారు. వివాదాలకు తావున్న ఉమ్మడి ప్రాజెక్టుల్ని కాకుండా ఏ మాత్రం సంబంధం లేని 107 ప్రాజెక్టుల్ని బోర్డుల పరిధిలోకి తీసుకురావటం రాష్ట్ర ప్రయోజనాలకు ముఖ్యంగా రాయలసీమ ప్రయోజనాలకు, గోదావరి పరివాహక ప్రాంతానికి తీవ్ర నష్టం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి మొద్దు నిద్ర, అనుభవరాహిత్యం, అవగాహనలోపం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. పుట్టిన గడ్డకే అన్యాయం చేస్తూ ప్రజల్ని మోసగిస్తూ జగన్ రెడ్డి చారిత్రక తప్పిదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కొట్టేసిన భూముల కోసం, హైదరాబాద్​లో ఆస్తుల పరిరక్షణ కోసం కేసీఆర్​తో లాలూచీ పడిన జగన్ రెడ్డి, కేసుల భయంతో కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని రామానాయుడు ఆరోపించారు.

వివాదం లేని ప్రాజెక్టుల్ని నోటిషికేషన్​లో ఏలా చేర్చుతారు...?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏమాత్రం వివాదం లేని ప్రాజెక్టుల్ని, బ్యారేజీలను నోటిఫికేషన్​లో చేర్చితే ఎలా ఆమోదయోగ్యమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని తెదేపా నేతలు నిలదీశారు. తెలంగాణకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు అనుమతులు లేకపోయినా నోటిఫికేషన్​లో పొందుపరిచారు. ఏపీలో అన్ని అనుమతులు ఉన్న రాయలసీమ ఎత్తిపోతలు, వెలుగొండ ప్రాజెక్టలను నోటిఫికేషన్​లోకి చేర్చకపోతే ముఖ్యమంత్రి, సజ్జల ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు.

విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారని గుర్తు చేసిన రామానాయుడు సీలేరు విద్యుత్ కేంద్రం తెలంగాణతో సంబంధం లేకుండా పూర్తిగా ఏపీ భూభాగంలో ఉంటే దానిని గోదావరి బోర్డులో చేర్చటాన్ని తప్పుబట్టారు.

తుంగభద్ర బోర్డు పరిధిలో ఉన్న హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలవలను సైతం కృష్ణాబోర్డు పరిధిలోకి తీసుకొస్తే వాటికి విలువెలా ఉంటుందన్నారు. కృష్ణా, గోదావరి నదులకు చివర్లో ఉన్న ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలను సైతం బోర్డుల పరిధిలోకి తీసుకురావటాన్ని ప్రభుత్వ పెద్దలు ఎలా స్వాగతిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలకు తావున్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్ని బోర్డుల పరిధిలోకి తీసుకొస్తే అర్థం ఉంటుంది కానీ పోలవరం ప్రాజెక్టుతో పాటు జలవిద్యుత్ కేంద్రం, గౌతమి, వశిష్ట కాలవల్ని సైతం బోర్డుల పరిధిలోకి వెళ్తే ప్రభుత్వానికి ఎలా హర్షణీయమని ప్రభుత్వాన్ని నిలదీశారు.

రాష్ట్ర జుట్టును కేంద్రం చేతుల్లో పెట్టి ఎలా ఆమోదయోగ్యమంటారో సీఎం సమాధానం చెప్పాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. సీఈ స్థాయి అధికారిని బోర్డులో నియమించాలని విభజన చట్టం చెప్తుంటే.. ఆ స్థాయి అధికారి ఒక్కరు కూడా లేకపోయినా ఇంతవరకూ నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. పెన్నా, గోదావరి టెండర్లు రద్దు, వైకుంఠపురం బ్యారేజీలు నోటిఫికేషన్​లో పోయిన పరిస్థితిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: OIL PALM: '20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళికలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.