ETV Bharat / city

నాటుసారా మరణాలపై నిలదీస్తే.. సభ నుంచి సస్పెండ్ చేశారు: తెదేపా ఎమ్మెల్యేలు

TDP MLAs on CM Jagan : నాటుసారా మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే వరుసగా మూడో రోజు కూడా తమను సభ నుంచి తమను సస్పెండ్‌ చేశారని ఏపీ తెదేపా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కనీసం సభలో చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు.

TDP MLAs on CM Jagan
ఏపీలో నాటు సారా మరణాలు
author img

By

Published : Mar 16, 2022, 2:03 PM IST

TDP MLAs on Liquor deaths: నాటుసారా తాగి ఎంతో మంది చనిపోతున్నా సీఎం జగన్​కు పట్టడం లేదని ఏపీ తెదేపా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటుసారా మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే వరుసగా మూడోరోజు కూడా తమను సభ నుంచి సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. ఈ అంశంపై కనీసం సభలో చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. సభలో ముఖ్యమంత్రి జగన్​ అసత్యాలపై సభాహక్కుల నోటీసులు ఇచ్చినా.. స్పీకర్‌ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటుసారాపై సమాధానం చెప్పలేకే తమను సస్పెన్షన్‌ వేశారని మండిపడ్డారు.

నాటుసారా మరణాలపై నిలదీస్తే...సభ నుంచి సస్పెండ్ చేశారు -తెదేపా

ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబడితే తమను సస్పెండ్‌ చేశారని తెదేపా ఎమ్మెల్యేలు అన్నారు. నాటుసారా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో సారా ధ్వంసం చేశామని పోలీసులు చెబుతున్నా.. సీఎం జగన్‌ మాత్రం నాటుసారా కాయనేలేదంటున్నారని తెలిపారు. నాటుసారా మృతులను సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా? అని మండిపడ్డారు. అధిక మద్యం ధరల కారణంగా నాటుసారా తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆరోపించారు.

"జంగారెడ్డి గూడెంలో నాటు సారా బారిన పడి 27 మంది చనిపోయారు. కానీ ప్రభుత్వం మాత్రం వాటిని సహజమరణాల కింద లెక్కేస్తుంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. సభలో వాటిపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభ నుంచి సస్పెండ్ చేసి మా గొంతు నొక్కేస్తున్నారు." -తెదేపా ఎమ్మెల్యేలు

ఇదీ చదవండి : Dengue Fevers in Nalgonda : ఊరంతా విషజ్వరాలే... లక్షలు ఖర్చుచేసినా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.