ETV Bharat / city

మూడోరోజు శాసనసభ నుంచి తెదేపా సభ్యుల సస్పెన్షన్

author img

By

Published : Dec 2, 2020, 10:34 PM IST

ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల మూడోరోజు.. తెదేపాకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్​కు గురయ్యారు. పోలవరంపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతుండగా... తెదేపా సభ్యులు అడ్డుపడుతున్నారని వైకాపా ఎమ్మెల్యేలు స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన విజ్ఞప్తి మేరకు తెదేపా సభ్యులపై సభాపతి ఒక్కరోజు సస్పెన్షన్ వేటు వేశారు.

మూడోరోజు శాసనసభ నుంచి తెదేపా సభ్యుల సస్పెన్షన్
మూడోరోజు శాసనసభ నుంచి తెదేపా సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజూ తెదేపా సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చలో ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా... తెదేపా ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అధికారపక్షం స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లింది.

పీటీఐ కథనం ప్రకారం... పోలవరంపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కావాల్సినంత సమయం ఇచ్చినా ఉద్దేశపూర్వంగానే తెదేపా సభ్యులు పోడియం వద్ద ఆందోళన చేపడుతున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 9 మంది ప్రతిపక్ష సభ్యులను ఒక్కరోజు పాటు సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌ను కోరారు.

తెదేపా సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, డోల బాలవీరాంజనేయ స్వామి, వేగుళ్ల జోగేశ్వరరావు, బెందాళం అశోక్‌, వెలగపూడి రామకృష్ణబాబు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌లను సభనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి తమ్మినేని ప్రకటించారు.

తెదేపా సభ్యుల సస్పెన్షన్ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. మార్షల్స్‌పై తెదేపా సభ్యులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి దాడి చేశారని దాడి చేశారని వైకాపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. మార్షల్స్ తమ పట్ల దురుసుగా ప్రవరిస్తున్నారని తెదేపా సభ్యులు పేర్కొన్నారు. తెదేపా సభ్యుల తీరుపై వైకాపా స్పీకర్​కు ఫిర్యాదు చేసింది.

మార్షల్స్‌పై దాడి సరికాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్‌గా తనకున్న అధికారం ప్రకారం నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

ఇదీ చదవండీ: బోరు బావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.