ETV Bharat / city

TDP leaders Letter: స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌కు టీడీఎల్పీ నేతల లేఖ.. - స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌కు టీడీఎల్పీ నేతల లేఖ

TDP leaders Letter to Speaker and Chairman: జే బ్రాండ్లలో ప్రజలు ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకర రసాయనాలున్నాయంటూ.. టీడీఎల్పీ నేతలు.. స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. నాటుసారా, జే బ్రాండ్ల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చట్టసభల్లో ప్రభుత్వం చర్చకు అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

TDP leaders Letter to Speaker and Chairman
స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌కు టీడీఎల్పీ నేతల లేఖ..
author img

By

Published : Mar 22, 2022, 1:11 PM IST

TDP leaders Letter to Speaker and Chairman: నాటుసారా, జే బ్రాండ్ల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చట్టసభల్లో ప్రభుత్వం చర్చకు అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌కు.. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేఖ రాశారు. జే బ్రాండ్లలో ప్రజల ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకర రసాయనాలున్నాయంటూ.. ల్యాబ్ రిపోర్టులు లేఖలకు జోడించారు.

TDP leaders Letter to Speaker and Chairman
స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌కు టీడీఎల్పీ నేతల లేఖ

క‌ల్తీ సారా కారణంగా జంగారెడ్డిగూడెంలోనే వారం రోజుల్లో 28 మందికి పైగా మృతి చెందారని నేతలు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చిమ‌ద్యాన్ని అత్యధిక ధ‌ర‌ల‌కు అమ్ముతుండ‌టంతో నిరుపేద‌లు సారాకి అల‌వాటు ప‌డి ప్రాణాలు తీసుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం స‌హ‌జ మ‌ర‌ణాలంటూ చ‌ర్చ నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తోందని ఆరోపించారు. సారా విక్రయ‌దారుల‌పైనా, త‌యారీదారుల‌పై ఓ వైపు కేసులు పెడుతూ.. మ‌రోవైపు అస‌లు సారాయే లేద‌ని చెప్పడం.. స‌భ‌ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మేనని మండిపడ్డారు. జే బ్రాండ్ల మ‌ర‌ణాల‌పై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాలని కోరారు.

"సారా మ‌ర‌ణాల‌పై తాము చ‌ర్చకు ప‌ట్టుబ‌ట్టడంతో.. ఎస్​ఈబీ రాష్ట్రవ్యాప్తంగా జ‌రిపిన దాడుల్లో సారా విక్రయం, త‌యారీపై 1129 కేసులు న‌మోదు చేసి, 677 మంది నిందితులని అరెస్టు చేశారు. ఇంతమందిని అరెస్టు చేశారంటే.. ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.. దీనిపై దృష్టి సారించాలి. ప్రమాద‌క‌ర మ‌ద్యంతోనే మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని అన్ని ఆధారాలు తాము సభ ముందు ఉంచడానికి సిద్ధం." అని లేఖలో తెదేపా నేతలు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రేవంత్ రెడ్డిపై అందుకే నాకు కోపం వచ్చింది: ఎమెల్యే జగ్గారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.