ETV Bharat / city

తెదేపా బృందంపై దాడి... సీపీకి ఫిర్యాదు

విజయవాడ శివారు.. ఇబ్రహీంపట్నంలో తెదేపా బృందంపై జరిగిన దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఘటనపై మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, కొమ్మారెడ్డి పట్టాభిరాం విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Sep 1, 2020, 12:18 PM IST

attack on tdp leaders
తెదేపా బృందంపై దాడి... విజయవాడ సీపీకి ఫిర్యాదు

ఏపీలోని విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో తెదేపా బృందంపై జరిగిన దాడిని ఖండిస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, కొమ్మారెడ్డి పట్టాభిరాం విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

కొండపల్లిలో ఫారెస్ట్‌ తనిఖీలకు వచ్చిన తెదేపా బృందంపై దాడి చేయడాన్ని దేవినేని ఉమ ఖండించారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో కూడా ఇదే విషయంపై నందిగామ జడ్పీటీసీ అభ్యర్థి అజయ్.. సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారని గుర్తు చేశారు.

ఆదివారం.. తెదేపా నేతలు పట్టాభి, అజయ్... కొండపల్లిలో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలను పరిశీలించి వస్తుండగా వారిని వెంబడిస్తూ ఇబ్రహీంపట్నం ఆల్ఫా హోటల్ దగ్గర వారిపై కొంత మంది దాడి చేసి పారిపోయారని ఆరోపించారు. దీనిపై విజయవాడ సీపికి ఫిర్యాదు చేశామన్నారు. దాడిలో గాయపడ్డ అజయ్​ను మెరుగైన వైద్యం కోసం ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్పించామన్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు.. అజయ్, పట్టాభిలకు ఫోన్ చేసి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్​ను కాపాడటానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవీచూడండి: ముందు అదృశ్యం.. తర్వాత హత్యకు గురైన వివాహిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.