Paritala Sriram fire on police: అధికార పార్టీ ఒత్తిళ్లతో తమ కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం సరికాదని తెలుగుదేశం నేత పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి నూతన గృహ ప్రవేశానికి శ్రీరామ్ వెళుతుండగా పోలీసులు అడ్డగించారు. నాలుగు వాహనాలకు మించి అనుమతి లేదని చెప్పారు.
ఈరోజు డిన్నర్‌కు కూడా పర్మిషన్ కావాలంటున్నారంటే మీపై ఎంత ఒత్తిడో అర్థమవుతోంది. దయచేసి పోలీసులు కుడా అర్థం చేసుకోవాలి. ఇక మీరు చేతులెత్తేస్తే వైకాపా తుడిచిపెట్టుకు పోయే పరిస్థితి దగ్గరలోనే ఉంది. ఇప్పటికే ప్రజల్లో వైకాపాపై వ్యతిరేకత ఉంది. ఇప్పుడు పునాదులతో సహా కుప్పకూలే స్థితిలో వైకాపా ఉంది. నా నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలే తీవ్రమైన నిరాశలో ఉన్నారు. పోలీసులు లా పరంగా పోతే అందరికీ మంచిది.
- పరిటాల శ్రీరామ్, తెదేపా నేత
ఈ క్రమంలోనే తెలుగుదేశం నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైకాపా ఎమ్మెల్యేలు పెద్దఎత్తున అనుచరులతో తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని శ్రీరామ్ ప్రశ్నించారు. పోలీసుల తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి అన్నింటికీ ఆటంకాలు కల్పిస్తున్న వైకాపా ఎమ్మెల్యేపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి : అక్షయ తృతీయ వేళ.. పసిడి దుకాణాలు కళకళ
'త్వరలో పాదయాత్ర చేపడతా.. దమ్ముంటే ఆపండి'