Gudivada Casino Controversy: గుడివాడ క్యాసినో వ్యవహారంపై తెదేపా నిజనిర్ధరణ కమిటీ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తోంది. ఈ అంశాన్ని ఏపీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రేపు ఉదయం 11.30కు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనుంది. క్యాసినోపై కరపత్రాలు, ఆధారాలను గవర్నర్‌కు అందించనుంది. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరనున్నారు.
కరపత్రాలు వాస్తవం కదా
TDP Fact Finding Committee: గుడివాడ క్యాసినోపై గత 10 రోజులుగా రాష్ట్రం అట్టుడిగిపోతున్నా ముఖ్యమంత్రి మాత్రం ఏమీ జరగనట్టు నటిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. గోవా నుంచి గుడివాడకు 13 మంది ఛీర్ గర్ల్స్ తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు చేయించారంటే విచారణ ఏదీ అని నిలదీశారు. కే-కన్వెన్షన్ లో జరుగు సంక్రాంతి సంబురాలకు హాజరవ్వాలని మంత్రి కొడాలి నాని, తమ్ముడు చిన్ని పేరుతో కరపత్రాలు వేసిన మాట వాస్తవం కాదా అని వర్ల ప్రశ్నించారు.
కే-కన్వెన్షన్ బయట ఎడ్ల పోటీలు నిర్వహించింది నాని అయితే క్యాసినో నిర్వహించింది కూడా నానినేనని ఆయన ఆరోపించారు. కే-కన్వెన్షన్ దగ్గర లే-అవుట్ లో జరిగిన మొత్తం జూద క్రీడలు కొడాలి నానే నిర్వహించారని అన్నారు. నాలుగు నెలల నుంచి అక్కడ క్యాసినో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే పోలీసులకు సమాచారం లేదంటే ఎవరు నమ్ముతారన్నారు. కొడాలి నానికి సంబంధం లేదని పోలీసులు చెప్పాలని చూస్తే భవిష్యత్తులో డిపార్ట్ మెంటుకు చెడ్డ పేరే మిగులుతుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి : FLAG HOSTING GOVERNOR:అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన: గవర్నర్ బిశ్వభూషణ్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!: