వైకాపా పాలనలో నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రాయలసీమ తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్‌పై.. ఆ ప్రాంత తెదేపా నేతలు సదస్సు నిర్వహించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా రాయలసీమ ప్రాంత పార్టీ నేతలు సదస్సుకు హాజరయ్యారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టుల భవితవ్యంపై చర్చించారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాన్ని తప్పుబట్టారు.
రాయలసీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తా. రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ కృషి చేశారు. సీమ కోసం ఎన్టీఆర్ హంద్రీనీవా ప్రాజెక్ట్ తెచ్చారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. పుష్కలంగా నీరున్నా చెరువులకు అందించడం లేదు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాయలసీమకు నీరు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు. బీటీ ప్రాజెక్టుకు, చెరువులకు నీరివ్వాలని డిమాండ్ చేస్తున్నా. అనంత జిల్లాలో అన్ని చెరువులకు నీరు ఇవ్వాలి.
--బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే
ఇదీ చదవండి: TRS President Election 2021: తెరాస అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ షురూ.. నామినేషన్ దాఖలు!