ETV Bharat / city

ప్రత్యేక హోదాపై యుద్ధం చేయకుండా.. పలాయనవాదమెందుకు?: చంద్రబాబు

author img

By

Published : Feb 14, 2022, 7:16 PM IST

Chandrababu on Special Status :కేంద్ర హోంశాఖ భేటీ అజెండాలో హోదా అంశం తమ ఘనతగా చెప్పుకున్న వైకాపా నేతలు.. ఇప్పుడు తెదేపాపై బురద చల్లడమేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలంటూ నాడు చేసిన సవాళ్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Chandrababu
Chandrababu

Chandrababu on Special Status : ప్రత్యేక హోదాపై యుద్ధం చేయకుండా.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పలాయనవాదమెందుకని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలంటూ నాడు చేసిన సవాళ్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్య నేతలతో వ్యూహకమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు..
కేంద్ర హోంశాఖ భేటీ అజెండాలో హోదా అంశం తమ ఘనతగా చెప్పుకున్న వైకాపా నేతలు.. ఇప్పుడు తెదేపాపై బురద చల్లడమేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ ఆదాయం తగ్గకపోయినా.. ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలకంటే దారుణంగా ఏపీని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా పరిశ్రమను కించపరిచారు..
Chandrababu On Tollywood: లేని సమస్యను సృష్టించి.. సినిమా హీరోలను సీఎం జగన్​ ఘోరంగా అవమానించారన్న చంద్రబాబు.. స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్​ను ప్రాధేయపడలా అని ఆక్షేపించారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమను కించపరిచారని దుయ్యబట్టారు. గ్రామాల్లో విద్యార్థులకు బడులను దూరం చెయ్యడమే 'నాడు-నేడు' పథకమని విమర్శించారు. పేదలకు చేరాల్సిన నరేగా పనుల్లో వైకాపా అవినీతిపై పోరాటం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీలో సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోయినా.. అధిక బిల్లులు వస్తుండటాన్ని తప్పుపట్టారు. విశాఖ ఉక్కుపై జగన్​ ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపును ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీచూడండి: Bandi sanjay Fires on KCR: తర్వాత పీసీసీ అధ్యక్షుడు కేసీఆరే: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.