ఏపీ ముద్దాయిల ఇష్టారాజ్యంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎప్పుడూ చూడని ఉన్మాదపాలన ఆంధ్రప్రదేశ్లో నడుస్తోందని మండిపడ్డారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ‘ఉన్మాది పాలనలో ఊరికో ఉన్మాది’ తయారవుతున్నారని విమర్శించారు.
జగన్మోహన్ రెడ్డి ప్రచారం పిచ్చి పరాకాష్టకు చేరిందని.. సర్వే రాళ్లపై కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడం సరికాదని దుయ్యబట్టారు. కరోనా పరిస్థితులను సరిగ్గా ఎదుర్కొంటే ఏపీలో ఇన్ని సమస్యలు వచ్చేవికావని అభిప్రాయపడ్డారు.
ఇవీచూడండి: ఉదయం కార్లలో తిరుగుతూ రెక్కీ.. రాత్రి గ్యాస్ కట్టర్లతో ఏటీఎం చోరీ