ETV Bharat / city

యూకేలో తెదేపా 40వ వార్షికోత్సవం.. 40కిపైగా నగరాల్లో సంబరాలు! - europe latest news

TDP 40th Anniversary : యూకేలో తెదేపా నేత వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో పార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు యూరప్​లో 40కిపైగా నగరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లను చేపట్టారు. యూరప్​లోని తెదేపా కౌన్సిల్ మెంబర్స్​, నందమూరి అభిమానులు కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నాలని వేణు మాధవ్ పిలుపునిచ్చారు.

TDP 40th Anniversary
యూకేలో తెదేపా 40వ వార్షికోత్సవం
author img

By

Published : Mar 25, 2022, 5:22 PM IST

TDP 40th Anniversary in the UK: తెలుగు రాష్ట్రాలతోపాటు యూకేలోనూ తెదేపా 40వ వార్షికోత్సవ వేడుకులను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెదేపా నేత వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. యూరప్​లోని ఎన్నారైలకు ఓ జ్ఞాపకంలా నిలిచిపోయేలా 40కిపైగా నగరాల్లో ఈ వేడుకలు ప్లాన్ చేస్తున్నారు. యూరప్​లోని తెదేపా కౌన్సిల్ మెంబర్స్​, నందమూరి అభిమానులు కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నాలని వేణు మాధవ్ పిలుపునిచ్చారు.

తెదేపా స్థాపన: తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని 29 మార్చి 1982లో స్థాపించిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీల సత్తాను గల్లీ నుంచి దిల్లీ వరకు వినిపించేలా చేసిన ఘనత ఎన్టీఆర్​దే అనడంలో సందేహం లేదు.

ఇదీ చదవండి: ఒప్పందం ప్రకారం చివరి గింజ వరకు కొంటాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.