ETV Bharat / city

కడప పెద్ద దర్గాను దర్శించుకున్న తారకరత్న

ఏపీలోని కడప పెద్ద దర్గాను సినీ నటుడు తారకరత్న దర్శించుకున్నారు. దర్గాకు పూల చాదర్ సమర్పించారు.

author img

By

Published : Oct 7, 2020, 7:10 PM IST

tarakaratna-visit-the-dargah-of-kadapa
కడప పెద్ద దర్గాను దర్శించుకున్న తారకరత్న

ఆంధ్రప్రదేశ్​లోని కడప పెద్ద దర్గాను సినీ నటుడు తారకరత్న దర్శించుకున్నారు. దర్గాను దర్శించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సినిమా చిత్రీకరణలో భాగంగా కడప వచ్చిన తారకరత్న ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గాను దర్శించారు. పూల చాదర్​ సమర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

నిర్వాహకులు దర్గా విశిష్టతను తారకరత్నకు తెలియజేశారు. పెద్ద దర్గా గురించి గతంలో చాలామంది తన దృష్టికి తీసుకొచ్చారని.. ఇప్పుడు దర్శించుకునే భాగ్యం లభించిందని తారకరత్న పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమూలంగా తొలగిపోవాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: ప్రభాస్ పుట్టినరోజు బహుమతిగా 'కిల్లర్ అప్​డేట్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.