ETV Bharat / city

తమిళ ప్రజలు ఆదరించనందుకు బాధపడ్డా: తమిళి సై

author img

By

Published : Feb 6, 2021, 10:43 PM IST

తెలంగాణ గవర్నర్​గా ఏడాది పాలన పూర్తి చేసుకున్న తమిళి సై.. చెన్నై గిండిలోని ఓ హోటల్​లో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. తన రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Tamilisai Soundararajan had completed one year of her Governor service in Telangana
తమిళ ప్రజలు ఆదరించనందుకు బాధపడ్డా: తమిళి సై

తెలంగాణ గవర్నర్​ తమిళి సై సౌందర రాజన్​ తన రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజలు తనను ఆదరించనందుకు బాధపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ప్రజలు అంగీకరించేవరకు.. సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. తెలంగాణ గవర్నర్​గా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నై గిండిలోని ఓ హోటల్​లో ఆమె ఓ పుస్తకాన్ని విడుదల చేశారు.

"నేను అనుకోకుండా తెలంగాణ గవర్నర్​గా ఎంపికయ్యాను. కొత్త రాష్ట్రానికి అనుభవం లేని గవర్నర్​ అని తీవ్ర విమర్శలు వచ్చాయి. పాత్రికేయులను నన్ను కలిసినప్పుడు వారికి నేను ఓ వైద్యురాలిని అని చెప్పుకున్నాను. ఇప్పుడు నన్ను తెలంగాణ ప్రజలు అంగీకరిస్తున్నారు. ఓ మహిళ రాజకీయ నేతగా ఎదగడం మామూలు విషయం కాదు. ఆమెకు ప్రతిసారి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి."- తమిళసై సౌందరరాజన్​, తెలంగాణ గవర్నర్​.

గతంలో కొందరు నా జుట్టును ఎగతాళి చేశారని, కానీ నేను పట్టించుకోలేదని తమిళి సై అన్నారు. రూపంలో తాను బాగా లేకపోయినా.. ప్రజలకు సేవ చేసే మంచి గుణం ఉందని చెప్పారు. తన తండ్రి కాంగ్రెస్​లో ఉన్నప్పుడు.. తాను దానికి పూర్తిగా విరుద్ధమైన సిద్ధాంతాలను నమ్మానని చెప్పారు. అందువల్ల తనతో తన కుటుంబ సభ్యులు ఏడాది పాటు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. అటువంటి దుస్థితిలో తనకు అండగా నిలబడిన వ్యక్తి తన భర్త మాత్రమేనని చెప్పారు.

ఇవీ చూడండి: ఇల్లందును మోడల్ సిటీగా మార్చేందుకు సహకరిస్తాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.