ETV Bharat / city

దివ్యాంగులకు.. రూ.లక్ష సాయం చేసిన సువర్ణ ఫౌండేషన్

కరోనా సామాన్య ప్రజలతో పాటు దివ్యాంగులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ నాంపల్లిలోని శ్రీ సాయిరామ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్​లో అటిజం, మల్టిపుల్ డిసేబుల్డ్​ సమస్యలున్నా పిల్లలు అక్కడే ఉంటూ చదువుకుంటున్నారు. విరాళాల మీద నడిచే ఈ పాఠశాల గత ఆరు నెలలుగా కరోనా ప్రభావం వల్ల దాతల సహాయం లేక ఇబ్బందుల్లో పడింది. పరిస్థితి తెలుసుకున్న సువర్ణ ఫౌండేషన్​ ఛైర్మన్​ రాజేష్​ బెస్త వారికి అండగా నిలిచారు. రూ. లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు.

Suvarna Foundation Helps to disabled home in nampally
దివ్యాంగులకు.. రూ.లక్ష సాయం చేసిన సువర్ణ ఫౌండేషన్
author img

By

Published : Oct 4, 2020, 5:43 PM IST

Updated : Oct 11, 2020, 2:16 AM IST

కరోనా వైరస్​ ప్రపంచం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. సామాన్య ప్రజలైతే.. ఉపాధి కోల్పోయి నానా ఇక్కట్లు పడ్డారు. హైదరాబాద్​లోని నాంపల్లిలో గల శ్రీ సాయిరామ్​ స్పెషల్​ ఎడ్యుకేషన్​ సొసైటీ అటిజం, మల్టిపుల్ డిసేబుల్డ్​ సమస్యలున్న పిల్లలకు వసతి కల్పించి చదువు నేర్పిస్తోంది.

విరాళాల తోనే..

విరాళాల మీదనే నడిచే ఈ పాఠశాల గత ఆరు నెలలుగా కరోనా ప్రభావం వల్ల దాతల సహాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. అద్దె కట్టడానికి, పిల్లలకు తిండి పెట్టడానికి కూడా అనేక అవస్థలు పడుతున్నారు. సమాచారం అందుకున్న సువర్ణ ఫౌండేషన్ సంస్థ ఛైర్మన్​ రాజేష్ బెస్త వారికి అండగా నిలిచారు. పిల్లలకు నూతన వస్త్రాలు , నిత్యావసర సరుకులతో పాటు స్కూల్ నిర్వహణకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

తోచినంత సాయం..

కరోనా ప్రభావం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... వారిని గుర్తించి తమ సంస్థ ద్వారా తోచినంత సహాయం అందిస్తున్నామని రాజేష్ తెలిపారు. స్కూల్ నిర్వహణ కష్టంగా మారిందని, దాతలు ముందుకు వచ్చి.. ఆర్థిక సహాయంతో పాటు... ప్రభుత్వం ద్వారా రెండు పడక గదుల ఇంటిని కేటాయిస్తే పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందని నిర్వహకురాలు ఉమ అన్నారు.

దివ్యాంగులకు.. రూ.లక్ష సాయం చేసిన సువర్ణ ఫౌండేషన్

ఇవీ చూడండి: 'కూతుళ్లకు విలువలు నేర్పితే అత్యాచారాలు ఆగుతాయ్'

Last Updated : Oct 11, 2020, 2:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.