ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని మంగళవారం నుంచి నిలిపి వేయాలని తితిదే నిర్ణయించింది. తిరుపతిలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరగడం, కంటైన్మెంట్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా టోకెన్ల జారీ నిలిపివేయనున్నారు.
ఇప్పటివరకు తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా రోజుకు 3 వేల టోకెన్లను తితిదే జారీ చేస్తోంది. ఈ టోకెన్ల జారీ ప్రక్రియను మంగళవారం నుంచి పూర్తిగా నిలిపివేయనున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు పొందిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించి దర్శనం కల్పించనున్నారు.
ఇదీ చదవండి: దేశంలో 28 వేలు దాటిన కరోనా మరణాలు