Shilpa kala Vedika Bandobastu: ముస్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ కామెడీ షో నిర్వాహణపై గందరగోళం నెలకొంది. హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళావేదికలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు సాయంత్రం శిల్పకళావేదికలో జరిగే మునావర్ ఫారూఖి కామెడీ షో అడ్డుకుంటామని భాజపా నాయకులు హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు వారం క్రితమే ఇప్పటికే భాజపాకి చెందిన పలువురు కార్యకర్తలు షోకు హాజరయ్యేందుకు టిక్కెట్లు కొనుగోలు చేశారని జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను ముందస్తు అరెస్టు చేసి లాలాగూడ పీఎస్‌కి తరలించారు. నిన్న పోలీసులు ఎమ్మెల్యేను గృహనిర్బందం చేసే ప్రయత్నం చేశారు. ఆయన తన నివాసం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
అయితే నిన్న బెంగళూరులో జరగాల్సిన షో వాయిదా వేసినట్లు ఇన్‌స్టాగ్రాంలో మునావర్ తెలిపారు. కొవిడ్ టెస్టు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు కమెడియన్ వెల్లడించారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మునావర్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే మునావర్ ఫారుఖీ కామెడీ షోకు నిన్న మాదాపూర్ పోలీసులు అనుమతిచ్చారు. అయితే నిర్వాహకులు మాత్రం డోంగ్రి పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తూ, రెండు వేల టికెట్లు అమ్ముడు పోయాయన్నారు. ఇప్పటికే శిల్పకళావేదికలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే భద్రతా పరిణామాల దృష్యా మునావర్ ఫారుఖీ కామెడీ శిల్పకళా వేదిక ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీసులు, ఆర్ముడ్ రిజర్వు పోలీసులు,ఎస్ఓటి,స్పెషల్ పార్టీ,సివిల్ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: