Supreme On Shops Allocation: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దేవాలయాల్లో హిందూయేతరులకు షాపుల కేటాయింపుపై సుప్రీం తీర్పు అమల్లో నిర్లక్ష్యం వహించడంతో.. వైకాపా ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. దుకాణాల కేటాయింపులో మతం అడ్డు కాకూడదన్న సుప్రీం.. వేలంలో అన్ని మతాలవారూ పాల్గొనవచ్చని స్పష్టం చేసింది.
ఇదీ నేపథ్యం..
దేవాలయాల్లో అన్య మతస్థులకు దుకాణాల కేటాయింపును నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో జీవో జారీచేసింది. జగన్ ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ.. శ్రీశైలం దుకాణ యజమానులు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. ఏపీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో.. దుకాణ యజమానులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీం.. దుకాణ యజమానులకు అనుకూలంగా ఫిబ్రవరిలో తీర్పును వెలువరించింది. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం అమలుచేయలేదంటూ.. మరోసారి దుకాణ యాజమానులు సుప్రీం ఆశ్రయించారు.
ఇదీచూడండి: రేపు దిల్లీకి మంత్రుల బృందం.. ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు