ETV Bharat / city

ban on crackers: బాణసంచా నిషేధం.. ఎవరికీ వ్యతిరేకం కాదు: సుప్రీంకోర్టు - బాణసంచా నిషేధం

బాణసంచా నిషేధంపై గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమని స్పష్టం చేసింది. టపాసుల విక్రయాలపై తాము వందశాతం నిషేధం విధించలేదని, హరిత బాణసంచాకు అనుమతి ఇచ్చామని కూడా వివరించింది.

crackers ban
crackers ban
author img

By

Published : Oct 29, 2021, 4:48 PM IST

బాణసంచాపై నిషేధం.. ఏ వర్గానికీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఆ ముద్రను సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొంది. అదే సమయంలో ఆనందం పేరిట పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగితే తాము చూస్తూ ఊరుకోమని తెలిపింది.

బాణసంచా నిషేధంపై గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ‘ఆనందం ముసుగులో మీరు (బాణసంచా తయారీదారులు) పౌరుల జీవితాలతో ఆడుకోలేరు. మేం ఒక ప్రత్యేక సముదాయానికి వ్యతిరేకం కాదు. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు మేం ఇక్కడ ఉన్నామన్న బలమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నాం’’ అని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నల ధర్మాసనం పేర్కొంది.

టపాసుల విక్రయాలపై తాము వందశాతం నిషేధం విధించలేదని, హరిత బాణసంచాకు అనుమతి ఇచ్చామని కూడా వివరించింది. ఆన్‌లైన్‌ అమ్మకాలపై పూర్తి నిషేధం కొనసాగుతుందని తెలిపింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లఘించిన ఆరు బాణసంచా తయారీ సంస్థలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి: పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.