నాలుగు రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు చేయట్లేదన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, దిల్లీ, బంగాల్, ఒడిశాలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయట్లేదని సుప్రీంకోర్టులో భాజపా నేత పేరాల శేఖర్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
పథకం అమలు చేయకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. కరోనా బాధితులకు తెలంగాణలో ఆరోగ్యశ్రీలోనూ అవకాశం ఇవ్వలేదని సుప్రీంకు తెలిపారు. పథకం అమలు చేస్తే కరోనా చికిత్స చేయించుకునే అవకాశం ప్రజలకు ఉండేదన్నారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. తెలంగాణ, దిల్లీ, బంగాల్, ఒడిశా ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: 'నైతిక విలువలతో కూడిన విద్య భావితరానికి అవసరం'