HEARING ON POLAVARAM PETITIONS IN SC : ఆంధ్రప్రదేశ్ పోలవరం నిర్మాణంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లపై జరిగిన విచారణలో.. అవసరమైతే సీఎంలు, సీఎస్‌ల స్థాయిలో చర్చలు జరపాలని ధర్మసనం వ్యాఖ్యానించింది. నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించలేదంటూ.. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీంని ఆశ్రయించాయి. తమ రాష్ట్రాల్లో ముంపు సమస్యలు ఉన్నాయన్నయని కొందరు వ్యక్తులు, సంస్థలు కలిపి పిటిషన్లు వేశారు.
పర్యావరణశాఖ అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణానికి పొంతన లేదని ఫిర్యాదు చేశారు. పర్యావరణ అనుమతులపై పునఃసమీక్ష చేయాలని సుప్రీంను కోరారు. అన్ని పిటిషన్లు కలిపి త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాస్తవాలతో కూడిన నివేదిక అందించాలని కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చింది. కేసు విచారణలో అదనపు పత్రాలు సమర్పించేందుకు రాష్ట్రాలు అనుమతి కోరగా.. అందుకు ధర్మాసనం అంగీకరించింది. కేసు విచారణ డిసెంబరు 7కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: ఈ నెల 12, 13న శాసనసభ సమావేశాలు.. బీఏసీ భేటీలో నిర్ణయం
'భారత్తో మాది అలాంటి స్నేహమే.. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం పక్కా