కొండపోచమ్మసాగర్ నిర్వాసితులకు పరిహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పెళ్లికాని మేజర్లకు కూడా పరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించగా... ఆ ఆదేశాలను సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది.
హైకోర్టు ఆదేశాలపై జస్టిస్ ఎ.ఎం. ఖాన్‌విల్కర్ ధర్మాసనం స్టే ఇవ్వగా... ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. విచారణలో భాగంగా పెళ్లికాని యువత కుటుంబంలో రాష్ట్ర ప్రభుత్వం భాగమేనని పేర్కొంది. పరిహారంపై గతంలో దాఖలైన మరో పిటిషన్‌కు ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం జతచేసింది.
ఇవీ చూడండి: సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ