తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ధిక్కరణ నోటీసులు పంపింది. విధుల్లో చేరేందుకు అనుమతి ఇవ్వట్లేదంటూ... 84మంది ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1,150 మంది ఉద్యోగులను 2 రాష్ట్రాలకు 50 శాతం చొప్పున పంపిణీ చేయగా... ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం 655 మందిని ఏపీ ప్రభుత్వం చేర్చుకున్నట్లు చెప్పారు.
84 మందిని మినహాయించి మిగిలిన వారిని తెలంగాణ ప్రభుత్వం చేర్చుకోగా... వీరంతా ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు... జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో పాటు... ఎస్పీడీసీఎల్ (SPDCL) సీఎండీ రఘుమారెడ్డి, కార్పొరేట్ కార్యాలయ అధికారి గోపాలరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. విచారణను జులై 16కి వాయిదా వేసింది.