ఆన్‌లైన్‌తో పాటు.. ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఇటీవల మంచి పేరు సంపాదించుకున్న సూపర్ హెల్తీ సంస్థ.. అమెజాన్‌లో మిక్స్ డ్ నట్స్ క్యాటగిరిలో బెస్ట్ సెల్లర్‌గా గుర్తింపు సాధించింది. బేగంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ సీఈఓ మేఘన ఈ విషయాన్ని వెల్లడించారు.
కొవిడ్ సమయంలోనూ లక్ష డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ను సాధించటం సంతోషంగా ఉందన్నారు సంస్థ ప్రతినిధులు. ఆరోగ్యవంతమైన జీవితం గడపాలనుకొనే వారికి.. ఉత్పత్తులను అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రీటైల్ రంగంలో త్వరలోనే మరింత వృద్ధి సాధించే దిశగా కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: వివాహితపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి