ETV Bharat / city

దిగ్విజయంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స - liver Transplantation success

ఇటీవల ఎల్బీనగర్ కామినేనిలో బ్రెయిన్ డెడ్ అయిన రైతు కాలేయాన్ని... విశ్రాంత అధ్యాపకుడు అనంతయ్యకు దిగ్విజయంగా అమర్చారు సన్​ సైన్ ఆస్పత్రి వైద్యులు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తి చేశారు.

Sunshine Rare liver Transplantation  success
దిగ్విజయంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స
author img

By

Published : Feb 13, 2021, 9:29 AM IST

సికింద్రాబాద్‌ సన్ సైన్ ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేసినట్లు ఆస్పత్రి ఎండీ డాక్టర్ గురువారెడ్డి వెల్లడించారు. ఇటీవల ఎల్బీనగర్ కామినేనిలో బ్రెయిన్ డెడ్ అయిన రైతు కాలేయాన్ని... విశ్రాంత అధ్యాపకుడు అనంతయ్యకు అమర్చారు.

దిగ్విజయంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స

ఈ తరహా శస్త్రచికిత్స తమ ఆస్పత్రిలో తొలిసారి అని తెలిపారు. డాక్టర్ విమాలాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు 5 గంటలపాటు శస్త్రచికిత్సను నిర్వహించినట్లు చెప్పారు. తాజా శస్త్రచికిత్సతో హైదరాబాద్ ఎలైట్ క్లబ్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్‌లో.. తమ ఆస్పత్రికి స్థానం దక్కినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: నేటి నుంచి ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు వ్యాక్సినేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.