Sundaranaidu Funerals: ఏపీలో పౌల్ట్రీరంగ అభివృద్ధికి విశేష కృషి చేసి అనారోగ్యంతో కన్నుమూసిన బాలాజీ హేచరీస్ అధినేత ఉప్పలపాటి సుందరనాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలోని బాలాజీ హేచరీస్ ఆవరణలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, గ్రామస్థులు, కోళ్ల పరిశ్రమ వ్యాపారులు.. అంతిమయాత్రలో పాల్గొన్నారు.
సుందరనాయుడు సోదరుడి కుమారుడు రమేశ్ బాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల కడపటి చూపుల అనంతరం.. సుందరనాయుడి చితికి నిప్పంటించారు. అంతకు ముందు వివిధ రంగాల ప్రముఖులు సుందరనాయుడుకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరరాజా సంస్థల వ్యవస్థాపకులు గల్లా రామచంద్రనాయుడు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, సినీనటుడు మోహన్ బాబు సహా పలువురు నివాళులు అర్పించారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హృద్రోగ సమస్యకు చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం సుందరనాయుడు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. పశువైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన.. కోళ్ల పరిశ్రమలో ప్రవేశించి ఆ రంగం అభివృద్ధికి అపార కృషిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.
ఇవీ చదవండి: