ETV Bharat / city

తెలంగాణ సోనామసూరికి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్​ - బ్రాండ్​ ఇమేజ్

తెలంగాణ సోనా బియ్యానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్​ కల్పించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలకు ఉపక్రమించింది. బీపీటీ-5205 సాంబమసూరి రకం పోలి ఉండే ఈ ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకానికి బ్రాండ్ కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కుదుర్చుకున్న ఒప్పందం కీలక దశకు వచ్చింది.

Study report of telangana sona masoori rice
తెలంగాణ సోనామసూరికి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్​
author img

By

Published : Oct 15, 2020, 2:17 PM IST

తెలంగాణ సోనామసూరి బియ్యానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్​ ఇమేజ్​ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీపీటీ – 5205, సాంబమసూరి రకాన్ని పోలి ఉండే ఆర్​ఎన్​ఆర్​ 15048 రకానికి బ్రాండ్​ ఇమేజ్​ కోసం జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఎస్​బీ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ సోనా బియ్యంపై రైతులు, వినియోగదారులు, వ్యాపార వర్గాలు, రైస్ మిల్లర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఐఎస్‌బీ ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. ప్రాధమిక నివేదికను ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు ఐఎస్‌బీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

తెలంగాణ సోనామసూరికి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్​

ఆదాయం పెరుగుతుంది..

తెలంగాణ సోనా రకం బహుళ ప్రాచుర్యం పొందిన వరి వంగడం. రాష్ట్ర విభజన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మూడు రకాల వరి వండగాలు విడుదలవగా... ఆర్‌ఎన్‌ఆర్‌-15048 రకం రైతుల ఆదరణ చూరగొంది. విడుదలకు ముందు నుంచే రైతుల్లో ఆసక్తి సొంతం క్రియేట్​ చేసిన ఈ రకం విడుదల తర్వాత కూడా దేశవ్యాప్తంగా రైతుల్లో డిమాండ్ సృష్టించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర 7 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ రకం వరి వంగడం సాగులో ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రకాన్ని జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్, తెలంగాణకు బ్రాండ్ ఇమేజీ సృష్టించేందుకు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆగస్టు 14న తేదీ ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత్‌సహా... ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో బియ్యం తినే రకాలు, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లపై విస్తృతంగా అధ్యయనం సాగింది. ఐఎస్‌బీ మార్కెటింగ్ అధిపతి ప్రొఫెసర్ డీవీఆర్ శేషాద్రి పర్యవేక్షణలో ప్రొఫెసర్ మధువిశ్వనాథ్‌ నేతృత్వంలో ఇద్దరు ఫ్యాకల్టీలు, ఐదుగురు విద్యార్థుల బృందం అధ్యయనం చేసింది. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా చూస్తే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎకరం విస్తీర్ణంలో వరిసాగు వాతావరణం, వర్షపాతం, భౌగోళిక పరిస్థితులు, వ్యవసాయ పద్ధతులు, ఉత్పత్తి, ఉత్పతాదక వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ రకాలు సాగు చేస్తే ఒక ఎకరం విస్తీర్ణంలో 9 టన్నుల బియ్యం ఉత్పత్తి వచ్చిందనుకుంటే... అదే తెలంగాణ సోనా అదనంగా 20 నుంచి 30 శాతం ఉత్పాదకత పెరుగుతుంది. ఆధునిక పద్ధతులు అవలంబిస్తే ఇంకా అదనపు దిగుబడులు పెంచుకోవచ్చు. క్షేత్రస్థాయిలో భూసారం దెబ్బతినకుండా మూడు పంటలు సాగుచేసుకుని 80 నుంచి 90 శాతం అధిక ఆదాయం పొందవచ్చని ప్రొఫెసర్ శేషాద్రి అన్నారు.

సాగు విస్తీర్ణం పెరిగింది..

గతేడాది కంటే ఈ ఏడాది తెలంగాణ సోనా వరి రకం పంట సాగు, విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వంపై నమ్మకంతోనే రైతాంగం ఈ సారి వ్యవసాయ శాఖ సూచించిన విధంగా నియంత్రిత పంట సాగు చేపట్టారు. వరి తీసుకుంటే 53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగవగా... ఇందులో ఏకంగా 20 లక్షల వరకు సన్న రకాలు సాగు చేసి ఉన్నట్లు అంచనాలున్నాయి. ఆరోగ్యపరంగా అద్భుత గుణాలు ఈ రకం వరిలో ఉండటం వల్ల తెలంగాణ సోనాకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతల్లో మిగులు రాష్ట్రంగా అవతరించింది. రైతుల సౌకర్యార్థం... ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా... ఐఎస్‌బీ మార్కెటింగ్ వ్యూహాలపై నివేదిక సిద్ధం చేయడం శుభపరిణామం.

పోషకాలు మెండు..

రైతాంగం నేడు ప్రధానంగా రిస్క్, పెట్టుబడి వ్యయం పెరగడం, సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం అనే మూడు సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో... ఇదొక ప్రత్యామ్నాయ పరిష్కారం అని చెప్పవచ్చు. సాంబ మసూరి బియ్యం కంటే ప్రోటీన్‌‌ 8.76 శాతం అధికంగా ఉండటమే కాక.. బీ2, బీ3 విటమిన్లు కూడా ఉంటాయి. ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకం బియ్యం తింటే గ్లూకోజ్‌‌ స్థాయిలు నియంత్రణలో ఉంచుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. నిత్యం మనం తీసుకునే రోజువారీ ఆహారంలో ఏ పోషకాలున్నాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నదే ఈ అధ్యయనం లక్ష్యం. స్వల్పకాలిక పంటైన తెలంగాణ సోనా బియ్యం అన్ని వర్గాలకు అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చేసిన సమగ్ర అధ్యయనం ప్రాథమిక నివేదిక సిద్ధం చేసి ఈ నెల 21న ప్రభుత్వానికి సమర్పిస్తామని ఐఎస్‌బీ ప్రొఫెసర్ మధు విశ్వనాథ్ చెప్పారు. చిన్నారులు, గర్భణీలు, వృద్ధులు... ఇలా అన్ని వయసుల వారికీ తెలంగాణ సోనా బియ్యం ఆరోగ్య ప్రత్యామ్నాయం అని ఐఎస్‌బీ తేలచ్చింది. కొవిడ్‌-19 నేపథ్యంలో పట్టణాల నుంచి గ్రామాలకు తిరుగు వలసలు వెళ్లిన ఎంతోమంది యువత, ప్రైవేటు ఉద్యోగులు సేద్యంబాట పడుతున్న వేళ ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం సాగు చక్కటి అవకాశం అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఇదీ చదవండి: 'శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.