ETV Bharat / city

Nizam college: కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థులు - లైబ్రరీ తెరవాలంటూ ఆందోళనకి దిగిన విద్యార్థులు

Nizam college: బషీర్​బాగ్​లోని నిజాం కాలేజీ​లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో మూసివేసిన లైబ్రరీని వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న అబిడ్స్ పోలీసులు ప్రిన్సిపల్​తో మాట్లాడతామని నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

Nizam college
ఆందోళనకి దిగిన విద్యార్థులు
author img

By

Published : Mar 11, 2022, 4:23 PM IST

Nizam college: నిజాం కళాశాలలో మూసివేసిన లైబ్రరీని తెరవాలంటూ విద్యార్థులు గ్రంథాలయ గేటు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మూసివేసిన లైబ్రరీని వెంటనే తెరవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పరీక్షలు జరుగుతున్నాయని కుంటిసాకుతో గ్రంథాలయాన్ని గత పది రోజులుగా మూసి ఉంచడంపై మండిపడ్డారు. తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్న... ప్రిన్సిపల్​ను వెంటనే తొలగించాలని కోరారు.

ఘటన స్థలానికి చేరుకున్న అబిడ్స్ పోలీసులు... ప్రిన్సిపల్​తో మాట్లాడతామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేదే లేదని విద్యార్థులు భీష్మించుకుని కూర్చున్నారు.

ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు భారీగా కళాశాలలో మోహరించారు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో.. వారు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:Telangana IT Budget 2022-23 : ఐటీలో 80వేల కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.