ETV Bharat / city

సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన తిరుమల శ్రీవారు - Malayappaswamy lion chariot

Tirumala Brahmotsavams: కలియుగ దైవం శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు సప్తగిరుల్లో వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. యోగ నరసింహ స్వామి అవతారంలో పరిమళ భరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో.. సర్వాంగ సుందరంగ ముస్తాబైన స్వామివారు.. తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.

సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన తిరుమల శ్రీవారు

author img

By

Published : Sep 29, 2022, 2:51 PM IST

Tirumala Brahmotsavams: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కలియుగ వైకుంఠనాథుడికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు సింహ వాహనంపై దేవదేవుడు దర్శనమిస్తున్నారు. అనంత తేజోమూర్తి శ్రీ వెంకటేశ్వరుడు రాక్షసుల పాలిట సింహస్వప్నమై గోచరిస్తారని స్తోత్ర వాంజ్ఞ్మయం కీర్తిస్తోంది. 'మృగాణం చ మృగేంద్రో అహం' తాను మృగాల్లో సింహాన్ని అని భగవద్గీతలో ఆ స్వామి ప్రవచించాడు. శ్రీవిష్ణు సహస్ర నామాల్లో స్వామికి నామాంతరంగా సింహః అని స్తోత్రం ఉంది. అందుకే సింహానికి ప్రత్యేకత.

ఆ జగన్నాయకుడి అవతారాల్లో నృసింహ అవతారం నాలుగోది. ఈ ఉత్సవాల్లో నాలుగో వాహనం సింహ వాహనం కావడమే విశేషం. యోగ నృసింహుడిగా సింహ వాహనంపై తిరువీధుల్లో దర్శనమిస్తున్న స్వామి.. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం. యోగ శాస్త్రంలో సింహం వహన శక్తికి, శీఘ్ర గమన శక్తికి ఆదర్శం. సింహ బలమంత భక్తిబలం కలిగి ఉన్నవారిని స్వామి అనుగ్రహిస్తాడని.. ఈ వాహన సేవ అంతరార్థం.

ఇవీ చూడండి..

వ్యవసాయోత్పత్తులకు అదనపు విలువే లక్ష్యంగా.. రాజన్న సిరిసిల్లలో అవగాహన సదస్సు

పాఠశాల విద్యార్థుల పడవ బోల్తా.. అనేక మంది గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.