జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారుల నియామకం పూర్తయ్యిందని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తయిందన్న పార్థసారథి... నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి నియమావళి అమలవుతుందని తెలిపారు.
పోటీచేసే అభ్యర్థులు జీహెచ్ఎంసీలో ఓటరుగా నమోదై ఉండాలని సూచించారు. 2016 ఎన్నికల్లో నిర్ణయించిన వార్డుల రిజర్వేషన్లే కొనసాగుతాయన్నారు. పార్టీల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి... ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సీనియర్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమిస్తామన్నారు.
ఆయా వార్డుల్లో నివసించే ఓటర్లందరినీ ఆ వార్డులోనే చేర్చాలని.. కుటుంబంలోని ఓటర్లంతా ఒకే వార్డులో ఉండేలా జాబితా రూపొందించాలని ఎస్‌ఈసీ సూచించారు.